Site icon NTV Telugu

యువకుడిని కాపాడిన ఇన్‌‌స్పె‌క్టర్‌ రాజే‌శ్వరి.. అభినందించిన సీఎం..

తమిళనాడులో 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో.. ఇప్పటికే 14 మంది మృతిచెందారు.. చాలా మంది ఇళ్లలోనే మగ్గుతున్నారు.. కనీసం తిండి కూడా లేకుండా అల్లాడిపోయేవారు కూడా ఉన్నారు.. ఇక, జనజీవనం స్తంభించిపోయింది.. ఇదే సమయంలో.. ఓ మహిళా పోలీస్‌ అధికారి 28 ఏళ్ల యువకుడిని కాపాడింది.. చెన్నైలోని టీపీ ఛత్రం ప్రాంతంలోని స్మశానవాటికలో భారీ వర్షం కారణంగా.. చెట్టు విరిగిపడి యువకుడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు.. అంతా చనిపోయాడని భావించిన పోలీసులకు సమాచారం అందించారు.. ఇక ఘటనా స్థలానికి చేరుకున్న ఇన్‌స్పెక్టర్‌ రాజేశ్వరి.. అచేతనంగా పడి ఉన్న ఆ యువకుడిని తన భుజాలపై మోసుకెళ్లి ఆటోలో పడుకోబెట్టారు. ఆ తర్వాత తోటి పోలీసు సిబ్బందితో ఆస్పత్రికి తరలించేలా చర్యలు తీసుకుంది.. అయితే, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోసల్‌ మీడియాకు ఎక్కింది.. ఆ వీడియోను వేలాదిమంది నెటిజన్లు వీక్షించారు.. ఇన్‌స్పెక్టర్‌ రాజేశ్వరిపై ప్రశంసల వర్షం కురిపించారు.

Read Also: గుడ్‌న్యూస్‌ చెప్పిన అమెరికా.. హెచ్‌-1బీ వీసాదారులు ఇక..

ఈ విషయం కాస్త ముఖ్యమంత్రి స్టాలిన్‌ వరకు చేరింది.. దీంతో.. ఇవాళ ఉదయం రాజేశ్వరిని తన కార్యాలయానికి పిలిపించుకున్న సీఎం స్టాలిన్.. ఆమెను అభినందించారు.. ఈ సందర్భంగా ఇస్పెక్టర్‌ రాజేశ్వరిని సన్మానించిన సీఎం స్టాలిన్.. ప్రశంస‌లు కురిపించారు… ఆమెకు ప్రశంసా పత్రాన్ని అందించి అభినందించారు.. మొత్తంగా.. విధి నిర్వహణలో ఇన్‌స్పెక్టర్‌ రాజేశ్వరి సమయస్ఫూర్తికి నెటిజన్లతో పాటు.. ముఖ్యమంత్రి నుంచి కూడా ప్రశంసలు అందుకున్నారు రాజేశ్వరి.

Exit mobile version