NTV Telugu Site icon

Fighter Jet Crash: జాగ్వార్ ఫైటర్ జెట్ క్రాష్.. పైలెట్ సురక్షితం..

Crash

Crash

Fighter Jet Crash: భారత వైమానిక దళం (IAF)కి చెందిన జాగ్వార్ ఫైటర్ జెట్ శుక్రవారం కుప్పకూలింది. హర్యానాలోని అంబాలాలో కూలిపోయింది. ఈ ఘటనలో పైలట్ సురక్షితంగా బయటపడ్డాడని ఐఏఎఫ్ తెలిపింది. పైలట్ చాకచక్యంగా వ్యవహరించి, విమానాన్ని జనావాసాలకు దూరంగా తీసుకెళ్లడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పైటర్ జెట్ కుప్పకూలే సమయంలో పైలట్ పారాశ్యూట్ సాయంతో సురక్షితంగా బయటపడ్డాడు. ప్రమాద కారణాలు తెలుసుకునేందుకు ఐఏఎఫ్ విచారణకు ఆదేశించింది.