కరోనాకు చెక్ పెట్టేందుకు ఉన్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్… అయితే, సువిశాల భారత దేశంలో వ్యాక్సినేషన్ పూర్తి చేసేది ఎప్పుడు అనే అనుమాలు ఉన్నాయి.. దానికి తోడు వ్యాక్సిన్ల కొరత కూడా వెంటాడుతోంది.. ఈ తరుణంలో.. శుభవార్త వినిపించారు కేంద్ర పర్యావరణశాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్… దేశ ప్రజలందరికీ ఈ ఏడాది డిసెంబర్ నాటికి వ్యాక్సిన్వ్వ వేయనున్నట్టు వెల్లడించారు. వ్యాక్సినేషన్‌పై ప్రతిపక్షాల విమర్శలపై.. ముఖ్యంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. ఇవాళ్ల ప్రధాని మోడీ, కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడంతో కౌంటర్ ఇచ్చిన ప్రకాష్ జవదేకర్.. 2021లోపే దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ముగుస్తుందన్నారు. ఇక, వ్యాక్సిన్లపై రాహుల్ గాంధీ ఆందోళన చెందితే… ఆయన కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల గురించి ఆలోచించాలంటూ సెటైర్లు వేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ గందరగోళంగా సాగుతోందని ఆరోపించిన కేంద్ర మంత్రి… 18-44 ఏళ్ల వారికి ఇచ్చిన కోటాను కూడా వాళ్లు తీసుకోవడం లేదని ఆరోపించారు. కాగా, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ, తెలుగు రాష్ట్రాలు కూడా టీకాలు కొనడానికి గ్లోబల్ టెండర్లకు పిలిచిన సంగతి తెలిసిందే.. ఏదేమైనా, కేంద్రం… రాష్ట్రాల వ్యాక్సినేషన్‌ను తప్పుబట్టింది.. రాష్ట్రాలు వ్యాక్సిన్ వృధా చేస్తున్నాయని ఆరోపించింది.
గుడ్‌న్యూస్.. 2021లోపే ప్రజలందరికీ వ్యాక్సినేషన్..
Prakash Javadekar