NTV Telugu Site icon

AI Adoption: ప్రపంచంతో పోలిస్తే, AIని తెగవాడుతున్న ఇండియా….

Ai Adoption

Ai Adoption

AI Adoption: కొత్త టెక్నాలజీని ప్రపంచంతో పోలిస్తే భారత్ అందిపుచ్చుకుంటోంది. తాజాగా ఓ సర్వే ప్రకారం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) భారతదేశం అత్యంత త్వరగా స్వీకరించినట్లు వెల్లడించింది. ఏఐ స్వీకరణలో భారత్ ప్రపంచంలోనే అగ్రగామిగా మారినట్లు బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (BCG) పరిశోధన తెలియజేసింది. 30 శాతం భారతీయ కంపెనీలు అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోస్తున్నాయని తెలిపింది.

Read Also: Joe Biden: ఇసుక బీచ్‌లో బైడెన్ పలుమార్లు తడబాటు.. వీడియో వైరల్

BCG నివేదిక ప్రకారం, ప్రపంచ వ్యాప్త కంపెనీలు 26 శాతం మాత్రమే ఏఐని ఉపయోగిస్తుండగా.. భారతదేశంలోని కంపెనీలు 30 శాతం ఇలాంటి టెక్నాలజీని వాడుతున్నారని పేర్కొంది. ఫిన్‌టెక్, సాఫ్ట్‌వేర్ మరియు బ్యాంకింగ్ రంగాలు తమ కార్యకలాపాలలో AIని ఎక్కువగా ఉపయోగిస్తున్నాయి. చాలా ఏళ్లుగా ఏఐపై ఇన్వెస్ట్‌మెంట్ చేయడం, టాలెంట్ పీపుల్ని నియమించడం వంటివి చేసిన తర్వాత ఇప్పడు సీఈఓలు వాటి నుంచి ప్రతిఫలం పొందుతున్నారని నివేదిక తెలియజేసింది.

ఆసియా, యూరప్, ఉత్తర అమెరికాలోని 59 దేశాలలో విస్తరించి ఉన్న 20 రంగాలకు చెందిన 1,000 మంది చీఫ్ ఎక్స్‌పీరియన్స్ ఆఫీసర్లు (CxOs), సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల సర్వే ఆధారంగా.. ‘‘AI వాల్యూ ఎక్కడ ఉంది..?’’ అనే పేరుతో నివేదిక రూపొందించింది. 10 మేజర్ ఇండస్ట్రీలను ఈ సర్వే కవర్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా 4 శాతం కంపెనీలు మాత్రమే అత్యాధునిక ఏఐ సామర్థ్యాలను అభివృద్ధి చేశాయి. అదనంగా 22 శాతం ఏఐ స్ట్రాటజీని అమలు చేశాయి. 74 శాతం కంపెనీలు ఇంకా ఏఐ వినియోగం విలువను చూపించాల్సి ఉంది.

Show comments