సవాళ్ల మధ్యే ఉక్రెయిన్ నుంచి 22,500 మంది భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చామన్నారు విదేశాంగ మంత్రి సుబ్రమణ్యం జైశంకర్. ప్రధానమంత్రి సూచనతో ఆపరేషన్ గంగ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. ఉక్రెయిన్ లో మిలిటరీ యాక్షన్, ఎయిర్‌స్ట్రైక్స్, షెల్లింగ్ జరుగుతుండగానే తరలింపు ప్రక్రియ చేపట్టామన్నారు. మొత్తం 90 విమానాలు నడిపామన్న ఆయన.. అందులో 76 పౌర, 14 ఎయిర్‌ఫోర్స్ విమానాలు ఉన్నాయని.. రష్యా, ఉక్రెయిన్ అధ్యక్షులతో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడి.. విద్యార్థుల తరలింపు ప్రక్రియకు మార్గాన్ని సుగమం చేసినట్టుతెలిపారు.
Read also: Srisailam: శ్రీశైలంలో 30 నుంచి ఉగాది మహోత్సవాలు
ఇక, రొమేనియా, పోలండ్, హంగెరీ, స్లొవేకియా, మాల్డోవాలకు థ్యాంక్స్ చెప్పిన ఆయన.. నేను కూడా ఆయా దేశాల విదేశాంగ మంత్రులతో మాట్లాడు.. నలుగురు కేంద్రమంత్రులను ఆ దేశాలకు పంపామని.. కర్కీవ్, సుమీల నుంచి తరలింపు ఛాలెంజ్ గా మారిందని ఆ సవాళ్లను గుర్తుచేసకున్నారు జైశంకర్. మొత్తంగా ఆపరేషన్ గంగ సక్సెస్ అయిందన్నారు జైశంకర్. ఉక్రెయిన్-రష్యా యుద్ధం, భారతీయుల తరలింపుపై రాజ్యసభలో ప్రకటన చేశారాయన.
