ఆర్థిక రాజధాని ముంబైలో గంజాయి కలకలం సృష్టించింది. అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ.14 కోట్లు విలువ చేసే 14 కేజీల గంజాయిను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు స్మగ్లర్ల నుంచి విదేశీ గంజాయిను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి ముంబైకు తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు.
ఇది కూడా చదవండి: BJP: అదే నిజమైతే, బీహార్‌లో ‘‘బిగ్ బ్రదర్’’గా బీజేపీ..
కస్టమ్స్ అధికారులకు ఏ మాత్రం అనుమానం రాకుండా వాక్యూమ్ సీల్డ్‌లో ప్యాకింగ్ చేసి లగేజీ బ్యాగుల్లో కేటుగాళ్లు తరలిస్తున్నారు స్కానింగ్‌లో వాక్యూమ్ సీల్డ్ గంజాయి ప్యాకెట్స్ బయటపడ్డాయి. బ్యాంకాక్ కేంద్రంగా ఈ అక్రమ గంజాయి దందా సాగుతోంది. ఆరుగురు స్మగ్లర్లపై ఎన్‌డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Vladimir Putin: పుతిన్ ఆరోగ్యానికి ఏమైంది.. వైరల్ అవుతున్న వీడియో..
