Site icon NTV Telugu

Holi 2022: హోలీ సందడి.. రంగుల పండుగ సెలబ్రేషన్స్..

దేశవ్యాప్తంగా హోలీ సందడి మొదలైంది.. రంగుల పండుగ సెలబ్రేషన్స్‌ సందడి సాగుతున్నాయి.. గురువారం రాత్రి నుంచే చిన్నాపెద్దా హోలీ వేడుకల్లో పాల్గొన్నారు.. కామ దహనం చేసిన అనంతరం ఒకరిపై ఒకరు రంగులు చల్లుకున్నారు.. ఇక, ఉదయం నుంచి రంగులు చల్లుకుంటూ చిన్నాపెద్దా తేడా లేకుండా ఎంజాయ్‌ చేస్తున్నారు.. కుల మతాలకతీతంగా సాంప్రదాయాలను పాటిస్తూ చేసుకునే పండగ హోలీ.. ఏడాది పొడవునా ఈ పండుగ కోసం ఎదురు చూసే వారు చాలా మందే ఉంటారు. కానీ గత రెండేళ్లుగా ప్రజలు కోవిడ్ కారణంగా హోలీ జరుపుకోలేదు. ఈసారి పరిస్థితి మారింది. రంగులతో వీధులన్నీ సందడిగా మారాయి.

Read Also: Holi: ఇంద్ర ధనుస్సులోని రంగులు ఇంటింటా వసంతంగా కురవాలి-సీఎం జగన్

గత రెండేళ్లుగా వ్యాపారాలు జరగకపోవడంతో ఈ ఏడాది పరిస్థితులు ఎలా ఉంటాయోనని సరుకు తక్కువగానే తెచ్చారు వ్యాపారులు. దీంతో మార్కెట్లో రేట్లు భారీగానే కనిపిస్తున్నాయి. తప్పని పరిస్థితుల్లో భారీ ధరలకే రంగులను కొనుగోలు చేస్తున్నారు జనం. రేట్లు ప్రియంగా ఉన్నప్పటికీ పండుగను సెలబ్రేట్ చేసుకోవాలి కదా అంటున్నారు. షాప్‌లలో నేచురల్ కలర్స్ అమ్ముతున్నామని పైకి చెప్తున్నారు కానీ కస్టమర్స్ వాటిపై పెద్దగా దృష్టి పెట్టడం లేదు. జాయ్ ఫుల్‌గా ఎంజాయ్ చేయాలంటే అన్ని హంగులు ఉండాలని ఫిక్స్ అవుతున్నారు. ఈ ఏడాది మార్కెట్లో ఎప్పుడూ లేని విధంగా రష్‌ కనిపిస్తున్నాయ్‌. డిఫరెంట్ డిఫరెంట్ కలర్ గన్స్‌తో ఫుల్ బిజీగా మారాయి. మొత్తానికి పొల్యూషన్ ఫ్రీ హొలీ అంటున్నారు తప్ప ఆ వాతావరణం ఎక్కడా కనిపించడం లేదు. మార్కెట్ నిండా కెమికల్స్‌తో కూడిన రంగులు ఉన్నాయి.

Exit mobile version