ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు సహా 60 మందికి పైగా బెదిరింపులు రావడం.. ఏ క్షణంలోనైనా చంపేస్తామంటూ ఆ లేఖల్లో వార్నింగ్ ఇవ్వడం కర్ణాటకలో కలకలం రేపుతోంది… మాజీ సీఎంలు సిద్ధరామయ్య, హెచ్‌డీ కుమార స్వామితో పాటు 61 మంది రచయితలకు ఈ లేఖలు వచ్చినట్టుగా తెలుస్తోంది.. ఆ లేఖలు ఎవరు పంపించారనేది తలియాల్సి ఉన్నా.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ లేఖలు రచ్చగా మారాయి.. ఆ లేఖల చివర్లో ఓ సహనం కలిగిన హిందువు అంటూ రాసి ఉండడంతో.. ఏ హిందువుల గ్రూపు నుంచో ఈ లేఖలు వచ్చాయనే ప్రచారం సాగుతోంది..
Read Also: MP Kanakamedala: కాగ్ నివేదిక తప్పయితే వైసీపీ ఎంపీలు ఎందుకు మాట్లాడటం లేదు?
ఆ లేఖల విషయానికి వస్తే.. మీరు ముస్లింల పక్షాన ఉంటూ.. హిందూ సమాజంపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.. సిద్ధరామయ్య, కుమారస్వామితో పాటు మిగిలిన రచయితలను దేశద్రోహులుగా అభివర్ణించారు.. అంతా హిందుమత ద్రోహులు. ఏ క్షణంలోనైనా మీ ప్రాణాలు పోవచ్చు.. మీ అంత్యక్రియలకు సిద్ధంగా ఉండమని మీ కుటుంబ సభ్యులకు చెప్పండి అంటూ ఆ లేఖలో పేర్కొన్నారు దుండగులు.. ఆ లేఖ అందినవారిలో సీనియర్ కన్నడ రచయిత కుమ్ వీరభద్రప్ప (కుంవీ) కూడా ఉన్నారు.. బెంగుళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో ఇటీవల కర్ణాటకలో మత విభజన, విద్వేషానికి వ్యతిరేకంగా మాట్లాడిన ఆయనకు రెండు పేజీల లేఖ పోస్ట్ ద్వారా వచ్చింది.. అందులో చంపేస్తానని బెదిరించారు. కుంవీని బెదిరించడమే కాకుండా, కర్ణాటకలో పెరుగుతున్న మత ఉద్రిక్తతలపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఇటీవల ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాశారు కొందరు ప్రముఖులు.. దానిపై సంతకం చేసిన 61 మంది రచయితలు, కళాకారులకు.. బీజేపీ మరియు హిందూత్వ సంస్థలను విమర్శిస్తున్న మాజీ ముఖ్యమంత్రులు సిద్ధరామయ్య, హెచ్‌డీ కుమారస్వామిలను బెదిరించారు. ఇక, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదు రచయిత కుంవీ.. తప్పుడు వాదనలు చేస్తూ కర్ణాటకలో మతపరమైన ఉద్రిక్తతను పెంచడానికి హోంమంత్రి స్వయంగా ప్రయత్నిస్తున్నప్పుడు, ఫిర్యాదు చేయడానికి పోలీసులపై నాకు ఎలాంటి విశ్వసనీయత ఉంటుందని అన్నారు కుంవీ..
