Site icon NTV Telugu

50 KM Traffic Jam: చండీగఢ్- కుల్లు- మనాలి హైవేపై 50 కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్!

Himachal

Himachal

50 KM Traffic Jam: హిమాచల్ ప్రదేశ్‌ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడటంతో.. చండీగఢ్- కుల్లు హైవే పూర్తిగా స్థంభించిపోయింది. దీని ఫలితంగా దాదాపు 50 కిలోమీటర్ల పొడవున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ ట్రాఫిక్ జామ్ వల్ల వేలాది వాహనాలు రోడ్డు పైనే ఇరుక్కుపోయాయి. ముఖ్యంగా ఢిల్లీ–ఎన్సీఆర్ మార్కెట్లకు వెళ్లాల్సిన వందలాది ట్రక్కులు ఆగిపోవడంతో పండ్లు, కూరగాయల రవాణా తీవ్రంగా దెబ్బతింది.

Read Also: CP CV Anand: గణేష్ నిమజ్జనానికి హైదరాబాద్ పోలీసులు సిద్ధం.. సీపీ సీవీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు

ట్రక్కుల్లో కుళ్లిపోతున్న ఆపిల్- టమోటాలు
చండీగఢ్- కుల్లు హైవే ట్రాఫిక్ జామ్ వల్ల కోట్ల రూపాయలు విలువ చేసే ఆపిల్స్‌, టమోటాలు, కూరగాయలు కుళ్లిపోవడంతో తీవ్ర నష్టం జరుగుతుందని ట్రక్ డ్రైవర్లు పేర్కొంటున్నారు. ఒక్కో ట్రక్కులో రూ. 4 నుంచి 4.5 లక్షల విలువైన సరుకు ఉండగా, ఆపిల్స్ మాత్రమే రూ. 50 కోట్లకు పైగా నిలిచిపోయాయి. ఇక, కుల్లు- మనాలిలో గత 5 రోజులుగా ఇరుక్కుపోయిన ట్రక్ డ్రైవర్ గఫ్ఫార్ మాట్లాడుతూ.. నేను తీసుకెళ్తున్న ఆపిల్స్ లోడ్ సాహిబాబాద్ మార్కెట్‌కు చేరాల్సి ఉంది, కానీ హైవే మూసుకుపోవడంతో ముందుకు కదల్లేదు పరిస్థితి ఏర్పడిందన్నారు. వేలాది ట్రక్కులు అజాద్‌పూర్‌, సాహిబాబాద్ మండీలకు వెళ్ళే దారిలోనే ఆగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశాడు.

Read Also: Box office results : అనుకున్నదే జరిగింది.. కూలీ, వార్ 2 ని వెనక్కి నెట్టిన రీజనల్ సినిమా

ట్రాఫిక్ క్లియరెన్స్ ఆలస్యం..
NHAI కుల్లు- మనాలి విభాగం ఇంజనీర్ అశోక్ చౌహాన్ మాట్లాడుతూ.. బియాస్ నది ఉద్ధృతంగా ప్రవాహించడంతో రహదారిలోని అనేక భాగాలు కొట్టుకుపోయాని తెలిపారు. ప్రస్తుతం రోడ్డు మరమ్మత్తు పనులు కొనసాగుతున్నప్పటికీ, కొండచరియల కారణంగా పనులు నెమ్మదిగా కొనసాగుతున్నాయని వెల్లడించారు. అలాగే, ఇలాంటి పరిస్థితులు రాబోయే రోజుల్లో మరింత ప్రమాదకరంగా మారవచ్చు.. అధికారులు ముందస్తు చర్యలు చేపడుతున్నారని చెప్పుకొచ్చారు.

Read Also: AAI JE Recruitment 2025: ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో జూనియర్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్.. మిస్ చేసుకోకండి

వర్షం కారణంగా ఆస్తి–ప్రాణ నష్టం..
సోమవారం నుంచి ఇప్పటి వరకు కురిసిన భారీ వర్షాలతో 4 షాపులు, 2 రెస్టారెంట్లు, ఒక ఇల్లు ధ్వంసం కాగా, బిలాస్పూర్ జిల్లాలోని నైనా దేవి నియోజకవర్గంలో ఒక ఇల్లు పూర్తిగా కూలిపోయింది. జూన్ 20వ తేదీ నుంచి ఇప్పటి వరకు వర్షం, కొండచరియల వల్ల 158 మంది మరణించగా, 38 మంది అదృశ్యం అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు రూ. 2,623 కోట్లకు పైగా నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు.

Exit mobile version