ఈ నెల 9న ఢిల్లీలోని రోహిణి కోర్టులో బాంబు పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. అయితే ఆ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్న పోలీసులకు నివ్వెరపోయే విషయాలు తెలిశాయి. డీఆర్డీవోకు చెందిన భరత్ భూషణ్ అనే శాస్త్రవేత్తకు తన పక్కింట్లో ఉండే న్యాయవాది అమిత్ విశిష్ట్ కు మధ్య గొడవలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇరువురు ఒకరిపైఒకరి కేసులు పెట్టుకున్నారు కూడా. అయితే లాయర్‌ను ఎలాగైనా అంతమొందించాలనుకున్నాడు భరత్ భూషణ్.
దీనికోసం తాను ముందుగా తయారు ఐఈడీ బాంబును టిఫిన్ బాక్స్‌లో పెట్టి ఢిల్లీలోని రోహిణి కోర్టులో గల 102వ నెంబర్ గదిలో ఉంచాడు. దీంతో ఆ గదిలో స్వల్ప పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఓ కానిస్టేబుల్‌కు కూడా గాయాలయ్యాయి. ఈ కేసు విచారణలో భరత్ భూషణ్ నేరాన్ని అంగీకరించడంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు.
