రాజకీయాల్లో మంత్రి స్థాయి హోదా.. రాష్ట్రంలోనే పలుకుబడి ఉన్న కుటుంబం.. 50 కి పైగా దాటిన వయస్సు.. భార్యాపిల్లలతో సంతోషంగా గడపాల్సింది పోయి చిలకొట్టుడు వ్యవహారాలను మొదలుపెట్టాడు.. తనకన్నా చిన్నవయస్సు యువతితో వివాహిత సంబంధం పెట్టుకొని ఇదుగో భార్యకు ఇలా అడ్డంగా బుక్కయ్యి పరువు పోగొట్టుకున్నాడు.. ఆయన ఎవరో కాదు గుజరాత్ కాంగ్రెస్ సీనియర్ నేత భరత్ సింగ్ సోలంకీ. మరో యువతితో రాసలీలలు నడుపుతూ భార్యకు అడ్డంగా దొరికిపోయాడు. ప్రస్తుతం ఈ ఘటన గుజరాత్ లో సంచలనం సృష్టిస్తోంది.
వివరాల్లోకి వెళితే.. గుజరాత్ కాంగ్రెస్ సీనియర్ నేత భరత్ సింగ్ సోలంకీ కి అతని భార్య రేష్మా కు గతకొన్నిరోజుల నుంచి విబేధాలు నెడుతున్న విషయం విదితమే.. తన భర్తకు కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా సభ్యురాలితో వివాహేతర సంబంధం ఉందని రేష్మా ఆరోపించింది.ఇక ఈ నేపథ్యంలోనే నేడు సోలంకీ, ఒక యువతితో లాడ్జిలో ఉన్నాడని తెలుసుకున్న రేష్మా అతడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొంది. రూమ్ లో ఇద్దరు ఏకాంతంగా ఉన్న సమయంలో భార్య ఎంట్రీ ఇవ్వడంతో మాజీ మంత్రి ఒక్కసారిగా షాకయ్యాడు. ఇక భర్తతో మరొక యువతి ఉండడం చూసి ఆగ్రహంతో రగిలిపోయిన రేష్మా, యువతిని చితకబాదింది. ఆమెతో పాటు వచ్చిన బంధువులు కూడా యువతిని ఇష్టంవచ్చినట్లు కొడుతూ సోలంకీ పై మాటల యుద్ధం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ సందర్భంగా సోలంకీ భార్య మాట్లాడుతూ “తన భర్తకు, మరో యువతికి ఉన్న అక్రమ సంబంధం వలనే మా వివాహ బంధంలో గొడవలు మొదలయ్యాయి. ఆ యువతి వలనే మేము విడాకులు వరకు వెళ్లామని” ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా తనను ఇంటినుంచి వెళ్లగొట్టడాని, అందుకే అతనిపై గృహహింస కేసు పెట్టినట్లు చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఘటన గుజరాత్ కాంగ్రెస్ పార్టీలో కలకలం సృష్టిస్తోంది.
