కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా చికిత్సకు అయ్యే ఖర్చు, కరోనా కారణంగా మృతి చెందిన వారికి ఇచ్చే ఎక్స్‌గ్రేషియాలపై పన్ను మినహాయింపులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఉద్యోగి.. కరోనా చికిత్సకు కంపెనీలు చెల్లించే మొత్తానికి పన్ను మినహాయింపు వర్తిస్తుందని స్పష్టం చేసింది కేంద్రం. కరోనాతో మరణించిన ఉద్యోగి కుటుంబాలకు కంపెనీ చెల్లించే పరిహారానికి కూడా ఈ మినహాయింపు వర్తిస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాగూర్ పేర్కొన్నారు.
read also : హుజురాబాద్ ఉప ఎన్నికకు ముహూర్తం ఖరారు !
అలాగే పన్ను చెల్లింపుదారులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు ఏర్పాటుచేసిన “వివాద్ సే విశ్వాస్” ఫథకం గడువు ఆగస్టు 31 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. పన్ను చెల్లించేందుకు అక్టోబర్ 31 వరకు అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించింది.
