NTV Telugu Site icon

కీల‌క బిల్లుకు గ్రీన్ సిగ్న‌ల్.. ఇక‌, ఆస్తి న‌ష్టాన్ని ఆందోళ‌న‌కారులే భ‌రించాలి..!

Haryana

ఎవైనా ఆందోళ‌న‌లు జ‌రిగిన‌ప్పుడు.. కొన్ని ద‌శ‌ల్లో అస‌హ‌నానికి గురై కొన్నిసార్లు,, కావాల‌ని కొంద‌రు ప్ర‌భుత్వ, ప్రైవేట్ ఆస్థుల విధ్వంసానికి పాల్ప‌డే ఘ‌ట‌న‌లు ఎన్నో చూస్తుంటాం.. అయితే, ఇక‌పై ఆందోళ‌న‌ల్లో ఎవ‌రి ఆస్తికి న‌ష్టం క‌లిగించినా.. ఆ న‌ష్టాన్ని ఆందోళ‌నాకారులే భ‌రించాల్సి ఉంటుంది.. దీనిపై కీల‌క బిల్లును తీసుకొచ్చింది హ‌ర్యానా ప్ర‌భుత్వం.. ఇక‌, ప్ర‌భుత్వం తెచ్చిన ఆస్తి నష్టం రికవరీ బిల్లు -2021కు ఇవాళ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు ఆ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్.. బిల్లుకు గవర్నర్ ఆమోద ముద్ర వేయ‌డంతో చ‌ట్టంగా రూపు దాల్చింది.. ఇక‌పై హ‌ర్యానాలో ప్ర‌భుత్వ‌, ప్రైవేటు ఆస్తుల‌కు ఆందోళ‌న‌కారులు ఎలాంటి న‌ష్టం క‌లిగించినా.. వారే భ‌రించాల్సి ఉంటుంది.. కొంద‌రు హింసాత్మక ఉద్యమానికి నాయకత్వం వహించే వారు, ప్రజలను రెచ్చగొట్టడమే కాకుండా ప్ర‌భుత్వ, ప్రైవేటు ఆస్తుల‌ విధ్వంసానికి పాల్పడుతున్నారి.. ఆ న‌ష్టం కొన్ని సంద‌ర్భల్లో భారీగా ఉంటుంద‌ని.. ఆయా వ్య‌క్తులు, సంస్థ‌లు, న‌ష్ట‌పోవాల్సిన ప‌రిస్థితి వ‌వ‌స్తుంద‌ని.. దానికి చెక్ పెట్ట‌డం కోస‌మే ఈ బిల్లును తెచ్చిన‌ట్టు చెబుతోంది హ‌ర్యానా ప్ర‌భుత్వం.