Site icon NTV Telugu

Amit Shah: సోమవారం రాత్రంతా మేల్కొనే ఉన్న అమిత్ షా.. దేనికోసమంటే..!

Amitshah

Amitshah

కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సంబంధించిన ఒక కీలక విషయం వెలుగులోకి వచ్చింది. సోమవారం రాత్రంతా ఆయన మేల్కొని ఉన్నట్లుగా వర్గాలు పేర్కొన్నాయి. అసలేం జరిగింది. ఆయన రాత్రంతా ఎందుకు మేల్కొని ఉండాల్సి వచ్చిందో వర్గాలు పేర్కొన్నాయి.

ఇది కూడా చదవండి: Katy Perry: పాప్ స్టార్‌తో మాజీ ప్రధాని డేటింగ్.. వీడియో వైరల్

సోమవారం పార్లమెంట్‌లో ఆపరేషన్ సిందూర్‌పై చర్చ మొదలైంది. పలువురు కేంద్రమంత్రులు ఆపరేషన్ సిందూర్ గురించి ప్రసంగించారు. మరుసటి రోజు.. అనగా మంగళవారం హోంమంత్రి అమిత్ షా ప్రసంగించాల్సి ఉంది. అయితే సోమవారమే భద్రతా దళాలు.. పహల్గామ్ ఉగ్రవాదుల్ని మట్టుబెట్టాయి. శ్రీనగర్‌లో మహాదేవ్ ఆపరేషన్‌లో ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చారు. వారి దగ్గర నుంచి పాకిస్థాన్ ఐడీ కార్డులు, చాక్లెట్లు.. వగేరా రైఫిల్స్, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు.

ఇది కూడా చదవండి: Delhi: ఢిల్లీలో చార్టర్డ్ అకౌంటెంట్ ఆత్మహత్య.. సూసైడ్ నోట్‌లో ఆవేదన వెల్లడి!

అయితే పహల్గామ్ ఉగ్రవాదులను చంపేసినట్లుగా అమిత్ షాకు ఉన్నతాధికారులు సమాచారం అందించారు. ఇక మరుసటి రోజు మంగళవారం లోక్‌సభలో ఆపరేషన్ సిందూర్‌పై ప్రసంగించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో శ్రీనగర్‌లో హతమైంది పహల్గామ్ ఉగ్రవాదులేనా? కాదా? అనే విషయం పూర్తిగా నిజ నిర్ధారణ చేసుకునేందుకు ఎప్పటికప్పుడు అధికారులతో అమిత్ షా రాత్రంతా మంతనాలు జరిపినట్లుగా వర్గాలు పేర్కొన్నాయి. పార్లమెంట్‌కు కచ్చితమైన సమాచారం అందించేందుకు నిజనిర్ధారణ చేసుకోవాలని డిసైడ్ అయ్యారు.

ఇది కూడా చదవండి: Honeymoon Murder Case: సినిమాగా హనీమూన్ మర్డర్ కేసు.. దర్శకుడికి గ్రీన్‌సిగ్నల్

సోమవారం రాత్రి అంతా అమిత్ షా మేల్కొని చండీగఢ్ ఫోరెన్సిక్ సైన్స్ లేబారేటరీతో నిరంతరం చర్చలు జరుపుతూనే ఉన్నారు. ఫోన్, వీడియో కాల్స్ చేస్తూ పర్యవేక్షిస్తూనే ఉన్నారు. బుల్లెట్ కేసింగ్‌లు, రైఫిల్స్‌ను నిపుణులు పరిశీలించారు. ఓ వైపు టెస్టులు జరుగుతుండగానే.. ఇంకోవైపు అమిత్ షా కాల్స్ చేసి తెలుసుకుంటూనే ఉన్నారు. ఇలా ఉదయం 5 గంటల వరకు నిపుణులతో సంభాషణలు సాగిస్తూనే ఉన్నారు. చివరికి తెల్లవారుజామున నిపుణులు నిర్ధారించారు. శ్రీనగర్‌లో హతమైంది పహల్గామ్ ఉగ్రవాదులేనని నిర్ధారించారు. దీంతో అమిత్ షా నిమ్మదించారు. కేవలం కొన్ని గంటలు మాత్రమే విశ్రాంతి తీసుకుని వెంటనే పార్లమెంట్‌కు వెళ్లిపోయారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

మంగళవారం పార్లమెంట్‌లో అమిత్ షా మాట్లాడినప్పుడు.. శ్రీనగర్‌లో హతమైంది పహల్గామ్ ఉగ్రవాదులేనని ప్రకటించారు. ఆరుగురు శాస్త్రవేత్తలు క్రాస్ చెక్ చేసి నిర్ధారించారని తెలిపారు. పహల్గామ్‌లో ఉపయోగించిన బుల్లెట్లు, తుపాకులు అవేనని నిపుణులు నిర్ధారించారని పేర్కొన్నారు. 100 శాతం శాస్త్రవేత్తలకు సరిపోయాయని చెప్పారు. అంతేకాకుండా వీడియో కాల్ ద్వారా తనకు నిర్ధారించారని వెల్లడించారు. ఇక ఉగ్రవాదుల దగ్గర పాకిస్థాన్ చాక్లెట్లు, ఐడీ కార్డులు ఉన్నాయని తెలిపారు. ఇంతకంటే ఏం ఫ్రూప్ కావాలంటూ విపక్షాలను అమిత్ షా ప్రశ్నించారు.

Exit mobile version