ఇటీవల దేశంలో 5 రాష్ట్రాలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ రాష్ట్రాల్లో పోటీ చేసిన పార్టీల అభ్యర్థులు తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటే. తాము చేస్తామని ప్రకటనలు చేస్తున్నాయి. అయితే తాజాగా గోవా పీసీసీ చీఫ్ గిరీష్ చోండార్కర్ మాట్లాడుతూ.. గోవాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది…ఇది గోవా ప్రజల ఆకాంక్ష అని ఆయన అన్నారు. అంతేకాకుండా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు 2017లో కూడా సరిగ్గా ఇవ్వలేదని, కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ దాటుతుందని ఆయన పేర్కొన్నారు.
టీఎంసీ, ఆప్ పార్టీలతో సంప్రదింపులు చేస్తున్నామని, ఇండిపెండెంట్ అభ్యర్థులతో కూడా టచ్ లో ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే, సీఎల్పీ నాయకున్ని ఎన్నుకుంటామని, ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఒక్క చోటే ఉండాలని అనుకున్నారన్నారు. అందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, 2017లో బీజేపీకి సంఖ్య బలం లేకున్న అధికార బలంతో అప్పడు ప్రభుత్వంను ఏర్పాటు చేసిందని ఆయన వ్యాఖ్యానించారు.
