Site icon NTV Telugu

సీబీఐపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

Madras HC

కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లుచేసింది మద్రాస్‌ హైకోర్టు.. సీబీఐకి స్వ‌యంప్ర‌తిప‌త్తి ఉండాల‌ని.. అప్పుడే ప్ర‌జ‌ల‌కు దానిపై విశ్వాసం పెరుగుతుంద‌ని వ్యాఖ్యానించింది.. సీబీఐ పంజరంలో బధించపడిన చిల‌క వంటిది అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన హైకోర్టు.. కేంద్రం ఎన్నికల కమిషన్‌, కాగ్‌ మాదిరిగా.. దానికి కూడా స్వయంప్రతిపత్తి కల్పించాలని సూచించింది. ఈ క్రమంలో సీబీఐకి అధిక అధికారాలు, అధికారంతో కూడిన చట్టబద్ధమైన హోదాను అందించే ప్రత్యేక చట్టాన్ని పరిగణలోకి తీసుకుని, అమలు చేయాలని కేంద్రాన్ని కోరింది మద్రాస్ హైకోర్టు. పార్లమెంటుకు మాత్రమే జవాబుదారీగా ఉండే భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ మాదిరిగా.. సీబీఐకి స్వయంప్రతిపత్తి ఉండాల‌ని.. అప్పుడే ప్రజలకు సీబీఐ మీద విశ్వాసం పెరుగుతుంద‌ని పేర్కొంది.

Exit mobile version