NTV Telugu Site icon

Rajasthan: 700 అడుగుల బోరు బావిలో 3 ఏళ్ల బాలిక.. 20 గంటలుగా రెస్క్యూ ఆపరేషన్..

Rajasthan

Rajasthan

Rajasthan: మూడేళ్ల బాలిక, 700 అడుగుల బోరు బావిలో పడిన సంఘటన రాజస్థాన్‌లోని కోట్‌పుట్లీ-బెహ్రోర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ దళాలు గత 20 గంటల నుంచి బాలికను రక్షించే ప్రయత్నాలు చేస్తున్నాయి. చేతన అనే బాలిక తన తండ్రి పొలంలో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు బోరు బాబిలో పడిపోయింది. దాదాపుగా 150 అడుగుల లోతులో ఆమె చిక్కుకుపోయింది. ఆమె కదలికల్ని కెమెరాల ద్వారా గమనిస్తున్నారు.

Read Also: Maoist Arrest : ఛత్తీస్‌గఢ్‌లో తెలంగాణకు చెందిన మావోయిస్టు అగ్రనేత అరెస్ట్

ఆక్సిజన్ సరఫరా చేయడానికి ఒక పైపుని బోర్‌వెల్‌లోకి పంపించారు. అధికారులు మొదట తవ్వడానికి ప్రయత్నించారు. అయితే, ఆమె చుట్టూ ఉన్న మట్టి తేమ కారణంగా కుదించబడటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒక రాడ్‌కి హుక్ బిగించి ఆమెను బయటకు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరికొన్ని గంటల్లో ఆమెను రక్షిస్తారని తెలుస్తోంది.

రెండు వారాల్లో ఇది రెండో బోర్‌వెల్ ఘటన. ఈ ఘటనకు ముందు రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో 5 ఏళ్ల బాలుడు బోరుబావిలో పడిపోయాడు. 56 గంటల గంటల తర్వాత అరీనా అనే బాలుడిని బోరు బావినుంచి బయటకు తీసుకువచ్చిన ప్రయోజనం లేకుండా పోయింది. అతను మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనపై రెండు వారాల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని జాతీయ మానవహక్కుల కమిషన్ ఆదేశించింది.

Show comments