NTV Telugu Site icon

Rajasthan Borewell Incident: 10 రోజుల పోరాటం వృథా.. విషాదంగా రాజస్థాన్ బోరుబావి ఘటన..

Rajasthan Borewell Incident

Rajasthan Borewell Incident

Rajasthan Borewell Incident: రాజస్థాన్‌లోని కోట్‌పుత్లీ బోరుబావి ఘటన విషాదంగా మారింది. 10 రోజుల పోరాటం వృథాగా మిగిలింది. అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసిన మూడేళ్ల బాలికను రక్షించలేకపోయారు. గత సోమవారం మూడేళ్ల బాలిక చేతన 700 అడుగుల లోతు ఉన్న బోరుబావిలో పడిపోయింది. 150 అడుగుల లోతులో చిక్కుకుపోయింది. డిసెంబర్ 23న మధ్యాహ్నం ఆడుకుంటూ బోరుబావిలో పడిపోయింది. 10 నిమిషాత తర్వాత బాలిక కేకలు విన్న కుటుంబీకులు బోరుబావిలో పడిపోయినట్లు గుర్తించారు.

Read Also: Maruti Suzuki: మారుతీ సుజుకి ఫస్ట్‌ ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ ఇదే.. లుక్ అదుర్స్!

వెంటనే అదే రోజు ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. బాలికను రక్షించేందుకు పైపుల ద్వారా ఆక్సిజన్ పంపారు. బోరుబావికి సమాంతరంగా మరో బావిని తవ్వి బాలికను రక్షించే ప్రయత్నం చేశారు. ఆహారం, చలి వాతావరణం, చీకటి ఇలా అన్ని ప్రతికూల పరిస్థితుల చేతిలో బాలిక ఓడిపోయింది.

ఈ రోజు బోరుబావి నుంచి బాలిక బయటకు తీసుకువచ్చారు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు బాలిక చనిపోయినట్లు ధృవీకరించారు. బాలికను బయటకు తీసే సమయానికి ఆమెలో ఎలాంటి కదలిక లేదు. 10 రోజలుగా సాగిన ఈ రెస్క్యూలో.. ఈ రోజు ఉదయం బోరుబావి చుట్టూ ఫినైల్ స్ప్రే, కర్పూరాన్ని కాల్చారు. దుర్వాసన రాకుండా అధికారులు నివారించారు. బోరుబావి చుట్టూ ఫినైల్ చల్లడంతో బాలిక మరణించిన విషయం దాదాపుగా స్పష్టమైంది. బోరుబావిలో పడిన ఒక రోజు తర్వాత డిసెంబర్ 24 సాయంత్రం నుంచే బాలికలో కదలికలు కనిపించలేదు. దీనికి తోడు వర్షం, డ్రిల్లింగ్‌లో రాళ్లు అడ్డురావడం కూడా రెస్క్యూ కార్యక్రమాలకు అవాంతరం కల్పించాయి.

Show comments