Site icon NTV Telugu

జ‌మ్ముకాశ్మీర్‌లో శ్రీవారి ఆల‌యానికి భూమిపూజ‌…రూ.33 కోట్లతో నిర్మాణం…

జమ్మూ కాశ్మీర్‌లో శ్రీవారి అల‌య నిర్మాణం కోసం ఈరోజు భూమి పూజ‌ను నిర్వ‌హించారు.  జ‌మ్మూజిల్లాలోని మ‌జిన్ గ్రామం ద‌గ్గ‌ర 62 ఎక‌రాల విస్తీర్ణంలో ఈ ఆల‌యాన్ని ఏర్పాటు చేయ‌బోతున్నారు.  మొత్తం 33.22 కోట్ల రూపాయ‌ల‌తో రెండు విడ‌త‌ల్లో 18 నెల‌ల్లోగా ఆల‌యాన్ని నిర్మించేందుకు టీటీడీ ప్ర‌ణాళిక‌లు సిద్దం చేసింది.  తొలి విడ‌త‌లో 27.72 కోట్ల రూపాయ‌ల‌తో వాహ‌న మండ‌పం, అర్చ‌కులు, ఇత‌ర పాల‌నా సిబ్బందికి వ‌స‌తి గృహాలు, తీర్థ‌యాత్రికుల‌కు వేచి ఉండే హాల్స్‌, ఇత‌రమౌలిక వ‌సతులు, ర‌హ‌దారులు, డ్రైనేజీ ప‌నులు, నీటిస‌ర‌ఫ‌రా, విద్యుద్ధీక‌ర‌ణ వంటి ప‌నుల‌ను పూర్తిచేస్తారు.  రెండో విడ‌త‌లో మొత్తం 5.50 కోట్ల రూపాయ‌ల‌తో వేద‌పాఠ‌శాల‌, క‌ళ్యాణ‌మండ‌పం నిర్మాణాలు పూర్తి చేస్తారు.  18 నెల‌ల్లో నిర్మాణం ప‌నులు పూర్తిచేయాల‌ని టీటీడీ సంక‌ల్పించింది.  

Exit mobile version