Site icon NTV Telugu

Sivaraj Patel: కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పటేల్ కన్నుమూత

Sivaraj Patel

Sivaraj Patel

కేంద్ర మాజీ  హోంమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత శివరాజ్ పటేల్ (90) కన్నుమూశారు. శుక్రవారం ఆయన తుదిశ్వాస విడించారు. మహారాష్ట్రలోని లాతూర్‌లో మరణించారు. సుదీర్ఘ రాజకీయ జీవితం కలిగి ఉన్నారు. లోక్‌సభ స్పీకర్‌గా.. పలు ముఖ్యమైన కేంద్ర మంత్రి పదవులు నిర్వహించారు.

శివరాజ్ పటేల్ ప్రస్థానం
శివరాజ్ పటేల్ (Shivraj Patil) ప్రముఖ రాజకీయ నాయకుడు. కేంద్ర మాజీ హోం మంత్రిగా.. లోక్‌సభ మాజీ స్పీకర్‌గా పని చేశారు. కాంగ్రెస్‌లో సీనియర్‌ నాయకుడిగా ఉన్నారు. 2004-2008 మధ్య హోం మంత్రిగా, 1991-1996 మధ్య లోక్‌సభ స్పీకర్‌గా పనిచేశారు.

విజయాలు-పదవులు:
కేంద్ర హోం మంత్రి: 2004-2008 వరకు బాధ్యతలు నిర్వహించారు
లోక్‌సభ స్పీకర్: 1991-1996 మధ్య 10వ స్పీకర్‌గా పని చేశారు.
రక్షణ మంత్రి: ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ప్రభుత్వాల్లో రక్షణ మంత్రిగా బాధ్యతలు
పంజాబ్ గవర్నర్: 2010-2015 వరకు గవర్నర్‌గా
లాతూర్ లోక్‌సభ సభ్యుడు: ఏడుసార్లు ఎన్నికయ్యారు

ఇతర ముఖ్య విషయాలు:
రాజీనామా: 2008 ముంబై దాడుల తర్వాత భద్రతా వైఫల్యానికి నైతిక బాధ్యత వహించి హోం మంత్రి పదవికి రాజీనామా చేశారు.

 

Exit mobile version