దేశ రాజధాని ఢిల్లీలో 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో ఢిల్లీ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్‌కు జీవిత ఖైదు విధించింది. మరణశిక్షను కోర్టు తిరస్కరించింది. అల్లర్ల సమయంలో సరస్వతీ విహార్ ప్రాంతంలో జస్వంత్ సింగ్, ఆయన కుమారుడు తరుణ్‌దీప్ సింగ్‌ను హతమార్చారన్న కేసులో ఇటీవల దోషిగా తేల్చిన కోర్టు.. మంగళవారం శిక్ష ఖరారు చేసింది.
ఇది కూడా చదవండి: SLBC Incident: క్షేమంగా తిరిగి తీసుకురావడానికి సర్వశక్తులా ప్రయత్నిస్తున్నాం..
సజ్జన్ కుమార్.. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. ఈ కేసులు కాకుండా.. ఆయనపై మరో రెండు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. 1984లో ఇందిరాగాంధీ హత్య అనంతరం చెలరేగిన సిక్కు వ్యతిరేక అల్లర్లలో సజ్జన్ కుమార్ కేవలం భాగస్వామి మాత్రమే కాదని, అతడు ఒక బృందానికి నాయకత్వం వహించినట్లు కోర్టు ప్రాథమికంగా నిర్ధారించింది.
ఇది కూడా చదవండి: MK Stalin: ‘‘దక్షిణాదిపై కేంద్రం కత్తి’’.. డీలిమిటేషన్, హిందీపై స్టాలిన్ ఫైర్..