Site icon NTV Telugu

బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు..

Explosion

Explosion

మరోసారి తమిళనాడులోని శివకాశిలో పేలుడు సంభవించింది.. శివకాశికి సమీపంలోని జమీన్‌సల్వార్‌పట్టి బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుళ్లు జరిగాయి.. పేలుడు ధాటికి భవనం పూర్తిగా ధ్వంసమైంది. ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు.. ఇక, భవనం శిథిలాల కింద దాదాపు 20 మంది ఉన్నట్టుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.. బాధితులను వెలికితీసిందుకు సహాయక చర్యలు కొనసాగుతుండగా.. మృతుల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉందంటున్నారు.. కాగా, తమిళనాడులోని విరుదునగర్‌ జిల్లాల్లో ఉన్న శివకాశి ప్రాంతంలో పెద్ద ఎత్తున బాణాసంచ కర్మాగారాలు ఉన్న సంగతి తెలిసిందే.. కరోనా మహమ్మారి, లాక్‌డౌన్‌ కారణంగా మూతపడిన ఈ ఫ్యాక్టరీలు.. సడలింపులు ఇచ్చిన తర్వాత మళ్లీ బాణాసంచా తయారీని ప్రారంభించాయి.. ఈలోగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Exit mobile version