Site icon NTV Telugu

Exit Polls 2022: ఎక్కడ.. ఎవరిది గెలుపో తేలిపోయింది…

ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ఇవాళ్టితో ముగిసింది.. మొత్తం ఏడు దశలుగా పోలింగ్‌ నిర్వహించగా.. ఉత్తరప్రదేశ్‌లో ఏడో మరియు చివరి దశ ఓటింగ్ ఈరోజు ముగిసింది.. దీనితో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసినట్టు అయ్యింది.. ఇక, ఈ నెల 10వ తేదీన ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నారు.. అయితే, ఈలోపే ఎగ్జిట్‌ పోల్స్‌ వచ్చేశాయి.. ఏ రాష్ట్రంలో ఎవరు గెలుస్తారు? ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి.. ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతోంది అనేది దానిపై ఓ అంచనా వేశాయి.. వాటి ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లో మరోసారి బీజేపీ విజయం సాధించనుండగా.. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉంది.. ఇక, రాష్ట్రాల వారిగా వివిధ ఏజెన్సీలు, న్యూస్‌ చానెల్స్‌ ఎగ్జిట్‌ పోల్స్‌ను ఓ సారి పరిశీలిద్దాం..

ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీలో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలున్నాయి.. మరోసారి బీజేపీ అధికారంలోకి రాబోతుందని చెబుతున్నాయి..
మ్యాట్రైజ్ పోల్: బీజేపీకి 262 నుంచి 277 సీట్లు, సమాజ్​వాదీ పార్టీకి 119 నుంచి 134 సీట్లు, బహుజన సమాజ్‌ వాదీ పార్టీకి 7-15, కాంగ్రెస్​కు 3-8
సీఎన్ఎన్‌ న్యూస్‌ 18: బీజేపీకి 240కి పైగా స్థానాలు, సమాజ్‌వాదీకి 140కి స్థానాలు, బీఎస్పీకి 17కు పైగా స్థానాలు, కాంగ్రెస్‌ పార్టీ 6 స్థానాలు
ఆత్మసాక్షి ఎగ్జిట్‌పోల్‌: బీజేపీకి 138-140 స్థానాలు, సమాజ్‌వాదీ పార్టీకి 235-240 సీట్లు, బీఎస్పీకి 19-23 స్థానాలు, కాంగ్రెస్‌ పార్టీకి 12-16 స్థానాలు
పీ-మార్క్‌: బీజేపీకి 225-255 స్థానాలు, సమాజ్‌వాదీ పార్టీకి 130-150 స్థానాలు, బీఎస్పీకి 12-22 స్థానాలు, కాంగ్రెస్‌ పార్టీకి 2-6 స్థానాలు

పంజాబ్‌లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉందని చెబుతున్నాయి ఎగ్జిట్‌పోల్స్‌.. ఆమ్‌ ఆద్మీ పార్టీ హవా కొనసాగబోతోంది.. మొత్తం 117 అసెంబ్లీ స్థానాలున్న పంజాబ్‌లో వివిధ సంస్థలు ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్‌ ఇలా ఉన్నాయి..
ఏబీపీ- సీ ఓటర్: ఆమ్‌ఆద్మీ పార్టీ 51-61, కాంగ్రెస్ పార్టీ 22-28, అకాలీదళ్‌ 20-26, బీజేపీ 7-13, ఇతరులు 1-5 స్థానాలు
యాక్సిస్ మై ఇండియా: ఆమ్‌ఆద్మీ 76-90, కాంగ్రెస్ 19-31, అకాలీదళ్‌ 7-11, బీజేపీ 1-4,
జన్‌ కీ బాత్: ఆప్‌ 60-84, కాంగ్రెస్‌ 18-31, అకాలీదళ్‌ 12-19, బీజేపీ 3-7
ఇండియా టుడే: ఆప్‌ 76-90, కాంగ్రెస్‌ 19-31, అకాలీదళ్‌ 0, బీజేపీ 0
పీ మార్క్: ఆప్‌ 62-70, కాంగ్రెస్‌ 23-31, అకాలీదళ్‌ 16-24, బీజేపీ 1-3

ఉత్తరాఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు హోరాహోరీగా సాగాయి.. ఫలితాలు కూడా అదే తరహాలో ఉంటాయని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేస్తున్నాయి.. బీజేపీ, కాంగ్రెస్‌ నువ్వా నేనా అనే తరహాలు సీట్లు గెలుపొందే అవకాశం ఉంది.
హోరీఏబీపీ- సీ ఓటర్‌: బీజేపీ 26-32, కాంగ్రెస్‌ 32-38, ఆప్‌ 0-2,
టు-డేస్‌ చాణక్య: బీజేపీ 36-50, కాంగ్రెస్‌ 17-31,
జన్‌కీ బాత్‌: బీజేపీ 32-41, కకాంగ్రెస్‌ 27-35, ఆప్‌- 0-1
టైమ్స్‌ నౌ- వీటో: బీజేపీ 37, కాంగ్రెస్‌ పార్టీ 31చ ఆప్‌- 1
మ్యాట్ర్జిజ్‌: బీజేపీ 29-34, కాంగ్రెస్‌ 33-38, బీఎస్పీ 1-3

మణిపూర్​అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.. మొత్తం 60 అసెంబ్లీ స్థానాలున్న మణిపూర్‌ అసెంబ్లీలో..
జన్‌కీ బాత్‌ ఇండియా: బీజేపీకి 23-28, కాంగ్రెస్‌ 10-14, ఎన్‌పీపీ 07-08, ఎన్‌పీఎఫ్‌ 05-07, జేడీయూ 05-07,
ఇండియా న్యూస్‌: బీజేపీ23-28, కాంగ్రెస్‌ 10-14
న్యూస్‌ 18: 27-31, కాంగ్రెస్‌ 11-17
జీ న్యూస్‌: బీజేపీ 32-38, కాంగ్రెస్‌ 12-17 స్థానాలు

గోవాలో కూడా టప్‌ ఫైట్‌ తప్పేలా లేదు.. 40 అసెంబ్లీ స్థాలున్న గోవా విషయానికి వస్తే..
సీఎన్‌ఎక్స్‌: బీజేపీ 11-16, కాంగ్రెస్‌ 11-17, ఆప్‌ 0-02, ఇతరులు 05-07
జన్‌కీ బాత్‌ ఇండియా న్యూస్‌: బీజేపీ 13-19, కాంగ్రెస్‌ 14-19, ఆప్‌ 01-02, ఇతరులు 04-08
ఈటీజీ రిసెర్చ్: బీజేపీ 17-20, కాంగ్రెస్‌ 15-17
ఇండియా న్యూస్‌: బీజేపీ 13-19, కాంగ్రెస్‌ 14-19, టీఎంసీ 3-5
ఇండియా టీవీ: బీజేపీ 10-14, కాంగ్రెస్‌ 20-25, టీఎంసీ 3-5
న్యూస్‌ ఎక్స్‌: బీజేపీ 17-19, కాంగ్రెస్‌ 11-13,
రిపబ్లిక్‌ టీవీ: బీజేపీ 13-17, కాంగ్రెస్‌ 13-17, టీఎంసీ 2-4
టైమ్స్‌ నౌ: బీజేపీ 14, కాంగ్రెస్‌ 16

Exit mobile version