NTV Telugu Site icon

వైర‌ల్ః దాహం తీర్చుకోవ‌డానికి ఏనుగు ఏంచేసిందో చూశారా…

భూమిపై తెలివైన జంతువు మ‌నిషి.  మ‌నిషితో పాటుగా కొన్ని ర‌కాల జంతువులు కూడా తెలివైన‌వే.  ప‌రిస్థితుల‌కు అనుగుణంగా ఆయా జంతువులు వ్య‌వ‌హ‌రిస్తుంటాయి.  అడ‌విలో ఉండే జంతువులకు దాహం వేస్తే సాధార‌ణంగా న‌దులు, చెరువుల వ‌ద్ద‌కు వెళ్లి దాహం తీర్చుకుంటాయి. అయితే, మ‌హారాష్ట్ర‌లోని గ‌డ్చిరౌలిలోని క‌మ‌లాపూర్ లో ఏనుగుల కోసం ప్ర‌భుత్వం ఓ శిభిరాన్ని ఏర్పాటు చేసింది.  ఈ శిభిరంలో వంద‌లాది ఏనుగులు ఆశ్ర‌యం పొందుతున్నాయి.  ఈ శిభిరంలో ఉన్న ఆడ ఏనుగు ఒక‌టి దాహం తీర్చుకోవ‌డానికి చెతిపంపు వ‌ద్ద‌కు వెళ్లి పంపును కొట్టి బోర్‌లో నుంచి వ‌చ్చే నీటిని తాగి దాహం తీర్చుకుంది.  దీనికి సంబందించిన విడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.