Electronic Interlocking: ఒడిశా బాలసోర్ సమీపంలో కోరమాండల్ రైలు దుర్ఘటనలో మరణాల సంఖ్య 288కి చేరుకుంది. 1000 మంది వరకు గాయపడ్డారు. కోరమాండల్ ప్రమాదానికి ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ సిస్టమ్ లోపం కారణమని కేంద్ర రైల్వే మంత్రి అశ్విణి వైష్ణవ్ వెల్లడించారు. రెండు రైళ్లు మధ్య ఢీకొనే ప్రమాదాన్ని ఈ ఇంటర్ లాకింగ్ వ్యవస్థ అడ్డుకుంటుంది. అయితే ఈ సిస్టమ్ లో లోపం కారణంగానే ఈ దారుణమై దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఇది ప్రాథమిక అంచనా మాత్రమే అని పూర్తిస్థాయిలో విచారణ తర్వాత అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని రైల్వే మంత్రి అన్నారు.
Read Also: IRCTC: ప్రతి నెలా రూ. 80,000 సంపాదించే అద్భుత అవకాశం రైల్వే కల్పిస్తోంది.. త్వరపడండి
ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ వ్యవస్థ అంటే ఏమిటి..?
ఈ వ్యవస్థ రెండు రైళ్లు ఢీకొనడకుండా అడ్డుకుంటుంది. రైల్వే ట్రాక్స్ వ్యవస్థలో కీలకంగా ఉంటుంది. రైల్వే భద్రతలో ఈ వ్యవస్థ కీలకంగా వ్యవహరిస్తుంది. ఒక వేళ సిగ్నల్స్ సరిగా మారని పక్షంలో, రైలును నిలిపివేసి, ట్రాకు సురక్షితంగా ఉందా..? లేదా..? అనే విషయాన్ని నిర్థారించేలా చేస్తుంది.
ఎలక్ట్రానికి ఇంటర్‌లాకింగ్ వ్యవస్థ రైలు ఎక్కడ ఉంది, ఏ ట్రాక్ లో నడుస్తుందనే వివరాలను నిర్థారిస్తుంది. ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ సిస్టమ్ రైలు కదలికలను పర్యవేక్షించడానికి మరియు నియంత్రించడానికి ఎలక్ట్రానిక్ కంట్రోల్ సిస్టమ్, కంప్యూటర్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. ఈ వ్యవస్థలో ట్రాక్ పై రైలు ఉన్న స్థానాన్ని గుర్తించడానికి సెన్సార్లు, ఫీడ్ బ్యాక్ పరికరాలను ఉపయోగిస్తారు. ఇది రైలును గుర్తించడంతో పాటు సిగ్నల్స్, ట్రాక్ ఛేంజ్ వంటి అనేక ఇతర రైల్వే వ్యవస్థలు సజావుగా పనిచేసేలా ఉపయోగపడుతుంది.
సాంప్రదాయ మెకానికఅల్ ఇంటర్ లాకింగ్ సిస్టమ్ స్థానంలో అత్యాధునిక ప్రత్యామ్నాయ వ్యవస్థగా ఎలక్ట్రానికి ఇంటర్ లాకింగ్ వ్యవస్థను తీసుకువచ్చారు. ఈ సిస్టమ్ వల్ల ప్రమాదాలు, రైళ్లు ఢీకొనే ప్రమాదాలను తగ్గించింది. అయితే రైల్వే శాఖ ప్రకారం, ఈ వ్యవస్థ విఫలమయ్యే అవకాశం 0.1 శాతం ఉంది. రైళ్ల ప్రయాణాలకు సిగ్నల్ ఇంటర్ లాకింగ్ సిస్టమ్ మెదడుగా భావిస్తారు. ఇది భద్రతా పరంగా చాలా కీలకం. సిగ్నలింగ్ గేర్‌ల ఆపరేషన్ కోసం అన్ని ఆదేశాలు ఇంటర్‌లాకింగ్ యొక్క సంక్లిష్ట నెట్‌వర్క్ ద్వారా ప్రాసెస్ చేయబడతాయి.