E20 Petrol Controversy: పెట్రోల్‌లో ఇథనాల్ కలిపే అంశం దేశవ్యాప్తంగా మరోసారి రాజకీయ చర్చకు దారితీసింది. పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలపాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యంపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. కర్ణాటకలో నిర్వహించిన పరీక్షల్లో కొన్ని పెట్రోల్ శాంపిల్స్ లో 26 నుంచి 31 శాతం వరకు ఇథనాల్ ఉన్నట్లు తేలిందని ఆరోపించారు. ‘E20 కాదు.. 420’ అంటూ సోషల్ మీడియా వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలపాలన్న లక్ష్యాన్ని మోడీ ప్రభుత్వం ప్రకటించిందని, అయితే వాస్తవంగా కొన్ని ప్రాంతాల్లో అంతకంటే ఎక్కువ ఇథనాల్ కలుపుతున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు.
కర్ణాటక ప్రభుత్వం ఏడు జిల్లాల్లోని పలు పెట్రోల్ బంకుల నుంచి నమూనాలు సేకరించి గుర్తింపు పొందిన ప్రయోగశాలల్లో పరీక్షలు నిర్వహించినట్లు రాహుల్ తన పోస్టులో ప్రస్తావించారు. ఈ పరీక్షల్లో మొత్తం 14 నమూనాల్లో 11 నమూనాలకు 20 శాతం కంటే ఎక్కువ ఇథనాల్ ఉన్నట్లు గుర్తించారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. కొన్ని నమూనాల్లో ఇథనాల్ శాతం 26 నుంచి 31 వరకు ఉన్నట్లు ఆరోపించారు.
రాహుల్ గాంధీ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL)కు చెందిన ఒక పెట్రోల్ నమూనాలో 31.2 శాతం ఇథనాల్ ఉన్నట్లు పరీక్షల్లో తేలిందని ఆరోపించారు. అలాగే హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ (HPCL)కు చెందిన నమూనాలో 30.5 శాతం ఇథనాల్ ఉన్నట్లు పేర్కొన్నారు. ఇండియన్ ఆయిల్, హిందుస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం (BPCL), నయారా, షెల్ వంటి ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు చెందిన పెట్రోల్ నమూనాల్లోనూ నిర్దేశిత పరిమితికి మించి ఇథనాల్ ఉన్నట్లు ఆయన ఆరోపించారు. అంతేకాకుండా, ఆయా కంపెనీల సొంత ప్రయోగశాలల్లో నిర్వహించిన పరీక్షల నివేదికల్లో ఇథనాల్ శాతాన్ని స్పష్టంగా ప్రస్తావించలేదని రాహుల్ విమర్శించారు.
పెట్రోల్ ధర చెల్లించి వాహనదారులు ఇంధనం కొనుగోలు చేస్తున్నప్పటికీ, అందులో అధిక శాతం ఇథనాల్ కలిపితే వినియోగదారులకు నష్టం జరుగుతుందని రాహుల్ గాంధీ అన్నారు. అన్ని వాహనాలు అధిక ఇథనాల్ మిశ్రమాలకు అనుకూలంగా తయారు చేయలేదని పేర్కొన్నారు. ఇథనాల్ శాతం పెరగడం వల్ల కొన్ని వాహనాల్లో మైలేజీ తగ్గే అవకాశం ఉందని, మరమ్మతుల ఖర్చులు కూడా పెరగవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. తమకు నచ్చిన వాహనాలను కొనుగోలు చేసిన ప్రజలు ఇంధన నాణ్యత కారణంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు.
పెట్రోల్ బంకుల్లో ఇంధనంలో ఎంత శాతం ఇథనాల్ కలిపారనే సమాచారం వినియోగదారులకు స్పష్టంగా అందించడం లేదని రాహుల్ గాంధీ ఆరోపించారు. పెట్రోల్‌లో ఇథనాల్ శాతం ఎంత ఉందో తెలుసుకునే అవకాశం లేకపోవడంతో వినియోగదారులు తమకు నచ్చిన ఇంధనాన్ని ఎంపిక చేసుకునే స్వేచ్ఛ కోల్పోతున్నారని అన్నారు. వాహనదారులు పెట్రోల్ ధర చెల్లిస్తున్నప్పుడు ఇంధనంలో కలిపిన పదార్థాల గురించి పూర్తి సమాచారం తెలుసుకునే హక్కు ఉండాలని అభిప్రాయపడ్డారు.
ఈ వ్యవహారంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమాధానం చెప్పాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా పెట్రోల్ ట్యాంకుల్లో వాస్తవంగా ఏ ఇంధనం నింపుతున్నారని, పెట్రోల్‌లో ఇథనాల్ అసలు శాతం ఎంత ఉందని ప్రశ్నించారు. నిర్దేశిత 20 శాతం కంటే ఎక్కువ ఇథనాల్ కలుపుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కంపెనీలపై ఎప్పుడు చర్యలు తీసుకుంటారని నిలదీశారు. ఇప్పటికే ప్రధానమంత్రికి తాను విసిరిన బహిరంగ చర్చ సవాల్‌లో ఈ అంశాన్ని కూడా చేర్చుతానని రాహుల్ గాంధీ తెలిపారు. ప్రభుత్వ విధానాల వల్ల నిజంగా ఎవరికి ప్రయోజనం కలుగుతోందని ప్రశ్నించారు.
E20 बना 420 – जनता की गाड़ी से पेट्रोल चोरी!
मोदी सरकार कहती है – पेट्रोल में 20% एथेनॉल है। कर्नाटक सरकार ने 7 ज़िलों से पेट्रोल के सैंपल लेकर मान्यता प्राप्त लैब में जाँच करवाई।
नतीजा देखिए
– 14 में से 11 सैंपल में 20% से ज़्यादा एथेनॉल
– IOCL में 31.2%, HPCL में 30.5%
– IOCL, HPCL, BPCL, Nayara, Shell – सरकारी हों या प्राइवेट – सब सीमा से ऊपर
– और कंपनियों की अपनी लैब ने एथेनॉल की मात्रा रिपोर्ट में लिखी ही नहींमतलब आप पैसा महंगे पेट्रोल का दे रहे हैं, टंकी में एथेनॉल भरा जा रहा है। नुकसान किसका? आपका।
आपकी गाड़ी इतना एथेनॉल पचाने के लिए बनी ही नहीं – मतलब, घटता माइलेज, बार-बार मैकेनिक। शौक से ली गई गाड़ी की बर्बादी।
और पंप पर लिखा तक नहीं कि टंकी में क्या डाला जा रहा है – चुनने का कोई विकल्प नहीं।
मोदी जी, बताइए – देश की टंकी में क्या भरा जा रहा है? पेट्रोल में असल में कितना एथेनॉल है? 20% से ज़्यादा मिलावट करने वाली कंपनियों पर कार्रवाई कब होगी?
और डिबेट की चुनौती अब भी खड़ी है। ये मुद्दा भी जोड़ लेंगे – आपकी नीतियों से असल में फ़ायदा किसे हो रहा है?
— Rahul Gandhi (@RahulGandhi) November 7, 2026

