NTV Telugu Site icon

Groom Sleeps At Wedding: పెళ్లిలో తాగి పడుకున్న వరుడు..ఆ తరువాత ఏం జరిగిందంటే.. వీడియో వైరల్..

Drunk Groom

Drunk Groom

Groom Sleeps At Wedding: పెళ్లవుతున్న సంతోషమో లేకపోతే పెళ్లి రద్దు కావాలన్న కోరికో తెలియదు కానీ ఓ పెళ్లి కొడుకు మాత్రం తప్పతాగి పెళ్లికి వచ్చాడు. ఇది చూసిన బంధువులు అంతా షాక్ అయ్యారు. చివరకు ఎలాగొలా పెళ్లి చేయాలనుకున్నా కూడా మద్యం మత్తులో ఉన్న పెళ్లికొడుకు సహకరించలేదు. పెళ్లి మంటపంలోనే పడుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతోంది. పెళ్లి కొడుకు చేసిన ఫీట్లకు నెటిజెన్లు పడిపడి నవ్వుకుంటున్నారు.

Read Also: Vote From Home: “ఇంటి నుంచే ఓటు”.. తొలిసారిగా కర్ణాటక ఎన్నికల్లో ప్రారంభం..

తప్పతాగి వచ్చిన పెళ్లి కొడుకు పేరు ప్రసేన్ జిత్ హలోయ్. అస్సాం రాష్ట్రం నల్బరి పట్టణ నివాసిగా గుర్తించారు. వైరల్ అవుతున్న వీడియోలో పెళ్లి కొడుకును పీటలపై కూర్చోబెట్టి వివాహం చేద్దాం అని ఎంతగా ప్రయత్నించినా కూడా కుదరలేదు. వివాహ మంత్రాలు చదువుతున్న సమయంలో పెళ్లికొడుకు నేలపై పడుకోవడాన్ని చూడవచ్చు. పంతులు గారు అతడికి నచ్చచెప్పే ప్రయత్నం చేసినా.. పెళ్లి ఆచారాలను వరుడు నిర్వహించలేకపోయాడు.

చేసేదేం లేక వధువు పెళ్లిని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. పెళ్లికి సంబంధించి అన్ని ఏర్పాటు చేశామని, పెళ్లి పూర్తి చేయడానికి శాయశక్తుల ప్రయత్నించామని, పరిస్థితి విషమించడంతో పెళ్లి కూతురు పెళ్లిని రద్దు చేసుకుందని, 95 శాతం మంది పెళ్లి కొడుకు బంధువులు మద్యం తాగే ఉన్నారని, దీనిపై గ్రామపెద్దలకు చెప్పగా వారు పోలీసులను అలర్ట్ చేసినట్లు వధువు బంధువులు వెల్లడించారు. కనీసం వరుడు కారు నుంచి కూడా దిగలేకపోయాడని, అతడి తండ్రి కూడా మద్యం మత్తులో ఉన్నాడని వధువు బంధువులు ఆరోపించారు. ఈ ఘటన తర్వాత పెళ్లి రద్దుకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ వధువు కుటుంబం నల్బరీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

Show comments