NTV Telugu Site icon

Rahul Gandhi: స్మృతీ ఇరానీ పట్ల అసహ్యంగా ప్రవర్తించొద్దు.. కాంగ్రెస్ శ్రేణులకు రాహుల్ గాంధీ విజ్ఞప్తి..

Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi: మాజీ కేంద్రమంత్రి స్మృతీ ఇరానీపై అవమానకరమైన పదజాలం, అసహ్యంగా మాట్లాడటం మానుకోవాలని ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తన మద్దతుదారులకు, కాంగ్రెస్ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. ప్రజలను అవమానించడం బలహీనకు సంకేతమని, బలం కాదని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. యూపీ అమేథీ నుంచి ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో స్మృతీ ఇరానీ, కాంగ్రెస్ నేత కిషోరీ లాల్ శర్మ చేతిలో 1,67,196 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

Read Also: Emergency: “ఎమర్జెన్సీ” విధించిన రోజుని ‘సంవిధాన్ హత్యా దివాస్’గా పాటించాలని కేంద్రం నిర్ణయం..

‘‘జీవితంలో గెలుపు ఓటములు జరుగుతాయి. శ్రీమతి స్మృతి ఇరానీ లేదా మరే ఇతర నాయకుడి పట్ల అవమానకరమైన పదజాలం ఉపయోగించడం మరియు అసహ్యంగా ప్రవర్తించడం మానుకోవాలని నేను ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను. ప్రజలను అవమానించడం మరియు అవమానించడం బలహీనతకు సంకేతం, బలం కాదు’’ అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

అంతకుముందు 2019 ఎన్నికల్లో స్మృతీ ఇరానీ చేతిలో రాహుల్ గాంధీ అమేథీ స్థానం నుంచి 55,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ సమయంలో కేరళలోని వయనాడ్ నుంచి గెలుపొందారు. ఈ సారి 2024 ఎన్నికల్లో యూపీ రాయ్‌బరేలీ, కేరళ వయనాడ్ నుంచి పోటీ చేసి రాహుల్ గాంధీ భారీ విజయం సాధించారు. తరువాతి పరిణామాల్లో వయనాడ్ స్థానాన్ని వదులుకున్న రాహుల్ గాంధీ, అక్కడ నుంచి సోదరి ప్రియాంకా గాంధీని బరిలోకి దింపేందుకు సిద్ధమయ్యారు.

Show comments