Site icon NTV Telugu

Doctor Assaults Patient : రోగిపై దాడి చేసిన డాక్టర్.. చర్యలు తీసుకుంటామన్నహెల్త్ మినిస్టర్..

రోగిపై డాక్టర్ దాడిచేసిన ఘటన హిమాచల్ ప్రదేశ్‌ లో చోటుచేసుకుంది. ఆస్పత్రికి వచ్చిన పేషంట్లతో మంచిగా మాట్లాడాలని డాక్టర్ కి చెప్పాడు బాధితుడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం బాధితుడిపై దాడి చేసాడు డాక్టర్. దీంతో బాధితుడు తీవ్రగాయాలు అయ్యాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్అవుతుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీ(ఐజీఎంసీ)లో ఈ ఘటన వెలుగు చూసింది. రాష్ట్రంలోని సిమ్లా జిల్లాకు చెందిన అర్జున్ పన్వర్ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. దీంతో ట్రీట్మెంట్ కోసం ఐజీఎంసీ ఆసుపత్రికి వెళ్లాడు. వైద్యులు ఎండోస్కోపీ చేయించాలని చెప్పారు.. సిబ్బంది సూచనలతో అర్జున్ పన్వర్ కాసేపు రెస్ట్ తీసుకోవడానికి బెడ్‌పై పడుకున్నాడు.

అయితే.. అక్కడికి వచ్చిన ఓ వైద్యుడు తనతో అమర్యాదకరంగా ప్రవర్తించాడని, ఇష్టమొచ్చినట్లు మాట్లాడడని అర్జున్ పన్వర్ ఆరోపించాడు. తాను మర్యాదగా ప్రవర్తించమని కోరినందుకు వైద్యుడు తనపై దాడి చేశాడని తెలిపాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన బాధితుడి కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఆవరణలో నిరసన తెలిపారు. ఈ దాడిలో బాధితుడి ముక్కుకు గాయమైంది. బాధితుడు వైద్యుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడని.. కేసు నమోదైందని ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలిపారు. ఈ విషయం ప్రజెంట్ సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారడంతో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ధని రామ్ శాండిల్ స్పందించారు. రోగి పట్ల వైద్యుడి ప్రవర్తనను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపి చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

Exit mobile version