NTV Telugu Site icon

DK Shivakumar: కమలా హారిస్ నుంచి ఆహ్వానం.. డీకే శివకుమార్ క్లారిటీ..

Dk Shiva Kumar

Dk Shiva Kumar

DK Shivakumar: అమెరికా అధ్యక్ష ఎన్నికల ముందు కీలక పరిణామం చోటు చేసుకుంది. కర్ణాటక ఉపముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత డీకే శివకుమార్‌కి డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ నుంచి ఆహ్వానం అందిదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రోజు రాత్రి ఆయన అమెరికా వెళ్లనున్నట్లు అక్కడ కమలా హారిస్‌తో భేటీ కానున్నట్లు వినికిడి. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాతో కూడా భేటీ కానున్నట్లు పలు నివేదికలు వెల్లడించాయి.

Read Also: Vinakayaka Statues: తెలంగాణలో దేశంలోనే అతిపెద్ద వినాయకుడి విగ్రహం.. ఏ జిల్లాలో ఉందంటే?

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అమెరికాలో ఉన్న సమయంలోనే శివకుమార్ కూడా అక్కడికి వెళ్తుండటం గమనార్హం. న్యూయార్క్‌లో ఆయన కమలా హారిస్‌తో వ్యక్తిగతంగా చర్చించనున్నట్లు, బరాక్ ఒబామాతో కూడా వన్ వన్ మీటింగ్ ప్లాన్ చేస్తున్నారని పలు మీడియా రిపోర్టులు పేర్కొన్నాయి. శివకుమార్‌కి కమలా హారిస్‌తో పాటు డెమొక్రాటిక్ నేతల నుంచి ఆహ్వానం అందినట్లు సమాచారం. కమలా హారిస్ కొన్ని నెలల నుంచి డీకే శివకుమార్‌తో సంప్రదింపులు జరుగుతున్నారనే ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది.

అయితే, ఈ రిపోర్టులపై డీకే శివకుమార్ క్లారిటీ ఇచ్చారు. ‘‘నేను సెప్టెంబర్ 15 వరకు మా కుటుంబంతో కలిసి యుఎస్‌కు ప్రయాణిస్తున్నాను. బరాక్ ఒబామా మరియు కమలా హారిస్‌లను కలుస్తున్నట్లు మీడియాలో వచ్చిన కథనాలు తప్పు, ఇది వ్యక్తిగత పర్యటన’’ అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

మరోవైపు సెప్టెబర్ 10న రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌, వచ్చే ఎన్నికల్లో ప్రెసిడెన్షియల్ అభ్యర్థి, ప్రస్తుత వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ మధ్య డిబేట్ జరగబోతోంది. మరోవైపు రెండు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం రాత్రి అమెరికా పర్యటనకు బయలుదేరారు. ఈ పర్యటనలో రాహుల్ గాంధీ ప్రవాస భారతీయులతో, విద్యా, వ్యాపారవేత్తలో సమావేశం కానున్నారు.

Show comments