Site icon NTV Telugu

డెల్టా వేరియంట్ బాధితుల్లో 300 రెట్లు అధికంగా వైరస్‌…

ప్ర‌పంచంలో చాలా దేశాల్లో మ‌ళ్లీ క‌రోనా కేసులు పెరుగుతున్నాయి.  మొద‌టి త‌రం క‌రోనా వైర‌స్ కంటే మ్యూటేష‌న్ల త‌రువాత వ్యాపిస్తున్న డెల్టా వేరియంట్ కేసులు ప్ర‌పంచంలో అత్య‌ధికంగా పెరుగుతున్నాయి.  వేగంగా వ్యాప్తి చెంద‌డంతో పాటుగా మ‌ర‌ణాల సంఖ్య‌ను కూడా ఈ వేరియంట్ పెంచుతున్న‌ది.  ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న టీకాల‌ను త‌ప్పించుకునే గుణం క‌లిగి ఉండ‌టంతో ఈ వేరియంట్ క‌ట్ట‌డి క‌ష్టంగా మారింది.  అయితే, డెల్టా వేరియంట్ తో బాధ‌ప‌డే బాధితుల్లో ఈ వేరియంట్ 300 రెట్లు అధికంగా వైర‌స్ లోడ్ ఉన్న‌ట్టుగా శాస్త్ర‌వేత్త‌ల ప‌రిశోధ‌న‌ల‌తో తేలింది.  ద‌క్షిణ కొరియా శాస్త్ర‌వేత్త‌లు దీనిపై ప‌రిశోధ‌న‌లు చేశారు.  డెల్టావేరియంట్ సోకిన 1848 మందిని ఇత‌ర వేరియంట్లు సోకిన 22,106 మంది బాధితుల‌పై చేసిన ప‌రిశోధ‌న‌లో ఈ షాకింగ్ విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి.  వైర‌స్‌లోడ్ 300 రెట్లు అధికంగా ఉన్న‌ప్ప‌టికీ, వ్యాప్తి ఆ స్థాయిలో లేద‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు.  

Read: మ‌గువ‌ల‌కు షాకిచ్చిన పుత్త‌డి…భారీగా పెరిగిన ధ‌ర‌లు…

Exit mobile version