NTV Telugu Site icon

Delhi: ఢిల్లీలో బాణాసంచా తయారీ, ఆన్‌లైన్ విక్రయాలపై నిషేధం..

Delhi Crackers

Delhi Crackers

ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో బాణాసంచా తయారీ, ఆన్‌లైన్ విక్రయాలపై నిషేధం విధించింది. వాయు కాలుష్యాన్ని పరిష్కరించడానికి ఢిల్లీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జనవరి 1 వరకు బాణసంచా తయారీ, నిల్వ, అమ్మకం, వాడకాన్ని నిషేధించింది. ఈ మేరకు పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ ఆదేశాలు జారీ చేశారు. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా ఢిల్లీలో బాణాసంచా తయారీ, నిల్వ, అమ్మకం, వినియోగంపై నిషేధం విధించనున్నారు. 2025 జనవరి 1 వరకు ఆన్‌లైన్‌లో పటాకుల అమ్మకం, డెలివరీపై కూడా నిషేధం ఉంటుందని పేర్కొన్నారు.

Read Also: Tragedy: బుడమేరులో శవమై తేలిన రియల్ ఎస్టేట్ వ్యాపారి

ఈ నిషేధాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు ఢిల్లీ పోలీసులు, డీపీసీసీ, రెవెన్యూ శాఖల సహకారంతో కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం 21 ఫోకస్ పాయింట్ల ఆధారంగా శీతాకాల కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తోందని అన్నారు.

Read Also: Rahul Gandhi: తెలుగు భాష ముఖ్యం కాదంటే.. అక్కడి వారిని అవమానించిట్లే..