దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం మరింత ఆందోళనకరంగా మారింది. ఇంట్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితులు లేవు. అంత భయంకరంగా వాతావరణం పొల్యూషన్ అయిపోయింది. ఇక చిన్న పిల్లలు, వృద్ధుల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. జనాలను కాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీంతో బయటకు రావాలంటేనే హడలెత్తిపోతున్నారు. ఇప్పటికే పొల్యుషన్ కంట్రోల్‌కు ఢిల్లీ సర్కార్ చర్యలు చేపట్టింది. చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రాథమిక పాఠశాలలను ఇప్పటికే మూసివేసేశారు. ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. తాజాగా గవర్నమెంట్ ఆఫీసుల టైమింగ్స్ విషయంలో కూడా సీఎం అతిషి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఇది కూడా చదవండి: Rashmika : చేతి నిండా ప్రాజెక్టులతో రష్మిక మందన్న ఫుల్ బిజీ..
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది ఉదయం 8.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేయాల్సి ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. అదే విధంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉదయం 9 గంటలనుంచి సాయంత్రం 5.30 వరకు డ్యూటీ చేయాలి. ఇక ఢిల్లీ ప్రభుత్వంలో పనిచేసే సిబ్బంది ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు ఆఫీసు కార్యకలాపాలు నిర్వహించాలని సీఎం అతిషి తెలిపారు. మరోవైపు ఢిల్లీలో గాలి నాణ్యత పెంచేందుకు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. అనవసరమైన నిర్మాణాలు, కూల్చివేతలపై నిషేధం విధించారు. ఢిల్లీ ఎన్ సీఆర్ పరధిలోని స్టోన్ క్రషర్లు, మైనింగ్ కార్యకలాపాలను నిలిపివేశారు.
ఇది కూడా చదవండి: Koti Deepotsavam 2024: ‘కోటి దీపోత్సవం’ వేడుకకు సీఎం రేవంత్.. స్వామివారికి హారతి