పూణెలో ఇంజనీర్ ఆత్మహత్య ఘటన మరువక ముందే దేశ రాజధాని ఢిల్లీలో మరో ఆత్మహత్య వెలుగులోకి వచ్చింది. కారణాలు ఏవైనా క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలు జీవితాలను బుగ్గిపాలు చేస్తున్నాయి. తాజాగా ఢిల్లీలో చార్టర్డ్ అకౌంటెంట్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. సూసైడ్ నోట్‌లో తన ఆవేదనను వెళ్లబుచ్చాడు. లేఖలోని మాటలు తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Katy Perry: పాప్ స్టార్‌తో మాజీ ప్రధాని డేటింగ్.. వీడియో వైరల్
ధీరజ్ కన్సల్(25), చార్టర్డ్ అకౌంటెంట్. ఒక గెస్ట్ హౌస్‌లో నివాసం ఉంటున్నాడు. సోమవారం గదిలోంచి వాసన రావడంతో సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు డోర్ ఓపెన్ చేయగా మంచంపై విగతజీవిగా పడి ఉన్నాడు. హీలియం గ్యాస్ పీల్చి ప్రాణాలు తీసుకున్నట్లు వెల్లడించారు. ఇక ఆత్మహత్యకు ముందు ఒక సూసైడ్ నోట్ కూడా రాశాడు. అలాగే సోషల్ మీడియాలో ఒక నోట్‌ను ఉంచాడు.
ఇది కూడా చదవండి: Russia Earthquake: వెలుగులోకి షాకింగ్ వీడియోలు.. హడలెత్తిపోయిన ప్రజలు
దేశ రాజధాని ఢిల్లీలో హీలియం ద్వారా ప్రాణాలు తీసుకోవడం ఇదే మొదటి కేసు అని పోలీసులు తెలిపారు. ధీరజ్.. గోల్ మార్కెట్‌లోని బెంగాలీ మార్కెట్ సమీపంలోని ఎయిర్‌బిఎన్‌బి గెస్ట్ హౌస్‌లో ఉంటున్నాడు. గెస్ట్ హౌస్ యజమాని అలారం మోగించినా బయటకు రాకపోవడంతో సంఘటన వెలుగులోకి వచ్చింది.
ఇది కూడా చదవండి: Honeymoon Murder Case: సినిమాగా హనీమూన్ మర్డర్ కేసు.. దర్శకుడికి గ్రీన్‌సిగ్నల్
తన మరణానికి ఎవరినీ నిందించొద్దని ధీరజ్ విజ్ఞప్తి చేశాడు. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో పేర్కొన్నాడు. ఇది తన వ్యక్తిగత నిర్ణయం అని.. తన జీవితంలో ప్రతి ఒక్కరూ నిజంగా దయతో ఉన్నారని చెప్పాడు. కాబట్టి దయచేసి ఎవరినీ ఇబ్బంది పెట్టొ్ద్దని కోరాడు. ఈ మేరకు పోలీసులకు.. ప్రభుత్వానికి ధీరజ్ విన్నవించాడు. అయితే తన డబ్బును మాత్రం అనాథ శరణాలయానికి.. లేదంటే వృద్ధాశ్రమానికి విరాళంగా ఇవ్వాలని విజ్ఞప్తి చేశాడు. అలాగే తన అవయవాలను కూడా దానం చేయాలని కోరాడు. అందరికీ ధన్యవాదలు చెప్పాలనుకుంటున్నట్లు పేర్కొన్నాడు. మీలో ఎవరూ ఇబ్బందుల్లో పడకూడదని కోరుకుంటున్నట్లు చెప్పాడు. అందుకే తాను ఎవరి పేర్లను బయటకు చెప్పట్లేదన్నాడు.
ఇక ధీరజ్ కన్సల్ ఘజియాబాద్‌లోని ఇ-కామర్స్ వెబ్‌సైట్ నుంచి హీలియం సిలిండర్‌ను ఆర్డర్ చేసినట్లు పోలీసులు కనుగొన్నారు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు… మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం లేడీ హార్డింజ్ ఆసుపత్రికి పంపినట్లు పోలీసులు తెలిపారు. ధీరజ్ కన్సల్.. 2002లో తన తండ్రిని కోల్పోయాడు. వెనువెంటనే అతడి తల్లి మరో వివాహం చేసుకుని భర్తతో ఉంటుంది. ధీరజ్ పూర్తిగా తాతామామల దగ్గరే పెరిగాడు. అమ్మ ప్రేమను పూర్తిగా కోల్పోయాడు. ధీరజ్ మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే సోషల్ మీడియా కార్యకలాపాలను కూడా పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
