Site icon NTV Telugu

PM Modi: ప్రధాని మోడీకి ఒమన్ అత్యున్నత పురస్కారం.. ‘‘ఆర్డర్ ఆఫ్ ఒమన్’’ ప్రదానం..

Pm Modi

Pm Modi

PM Modi: ప్రధాని నరేంద్రమోడీకి ఒమన్ తన దేశ అత్యున్నత గౌరవాన్ని ప్రధానం చేసింది. భారత్-ఒమన్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో ప్రధాని మోడీ చేసిన కృషికి గానూ గురువారం ఒమన్ సుల్తానేట్ ప్రత్యేకమైన పౌర పురస్కారం ‘‘ఆర్డర్ ఆఫ్ ఒమన్’’ను సుల్తాన్ హైతం బిన్ తారిక్ ప్రదానం చేశారు. జోర్డాన్, ఇథియోపియాతో సహా మూడు దేశాల పర్యటనలో భాగంగా చివరి దేశం ఒమన్‌లో ప్రధాని మోడీ రెండు రోజులు పర్యటిస్తున్నారు.

Read Also: Dhurandhar: పాక్‌లో “ధురంధర్” బ్యాన్.. కానీ, వైరల్ సాంగ్‌తో చిన్న భుట్టో ఎంట్రీ..

దీనికి ముందు, ఇథియోపియా కూడా తన అత్యున్నత పురస్కారం అయిన ‘‘గ్రేట్ హానర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా’’ను ప్రధాని మోడీకి ప్రదానం చేసింది. ఇప్పటి వరకు ప్రధానికి విదేశాలు 29 అత్యున్నత పౌర పురస్కారాలు ప్రకటించాయి. భారతదేశం, ఒమన్ మధ్య దౌత్య సంబంధాల 70వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మోడీ మస్కట్ పర్యటన జరిగింది. వాణిజ్యం, పెట్టుబడి, ఇంధనం, రక్షణ, సంస్కృతిలో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుకోవడంపై ఇరు దేశాలు దృష్టి సారించాయి.

అంతకుముందు, ఒమన్‌లో ప్రధాని మోడీకి గార్డ్ ఆఫ్ హానర్‌తో అత్యున్నత స్వాగతం పలికారు. గతంలో క్వీన్ ఎలిజబెత్, క్వీన్ మాగ్జిమ్, చక్రవర్తి అకిహిటో, నెల్సన్ మండేలా, జోర్డాన్‌కు చెందిన కైండ్ అబ్దుల్లాకు ‘‘ ఆర్డర్ ఆఫ్ ఒమన్’’ గౌరవాన్ని ప్రదానం చేశారు. ఇప్పుడు, ప్రధాని మోడీని ఈ అవార్డుతో ఒమన్ సత్కరించింది.

Exit mobile version