Site icon NTV Telugu

Cruise drug bust case: డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ కు క్లీన్ చిట్

Aryan Khan

Aryan Khan

ముంబై క్రూజ్ షిప్ డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ కు క్లీన్ చిట్ ఇచ్చింది నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ). ముంబైలో ఓ క్రూజ్ షిప్ లో డ్రగ్స్ పార్టీ జరుగుతుందనే పక్కా సమాచారంతో ఎన్సీబీ అధికారులు దాడి చేశారు. ఈ సమయంలో బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ తో పాటు మరికొందరు బిగ్ షాట్స్ కొడుకులు పట్టుబడ్డారు. అయితే ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ తీసుకునేందుకే క్రూజ్ షిప్ లోని పార్టీకి అటెండ్ అయ్యాడని ఎన్సీబీ అధికారులు ఆరోపించారు.

అయితే తాజాగా ఎన్సీబీ అధికారులు క్లీన్ చిట్ ఇచ్చారు. ఆర్యన్ కు వ్యతిరేఖంగా ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో క్లీన్ చిట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆర్యన్ ఖాన్ అమాయకుడని.. అతను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని ఎన్సీబీ తెలిపింది. ఎన్డీపీఎస్ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద 14 మందిపై కేసులు నమోదు అయ్యాయి. అయితే ఇందులో ఆరుగురిపై సాక్ష్యాధారాలు లేకపోవడంతో క్లీన్ చిట్ ఇస్తున్నట్లు ఎన్సీబీ అధికారి సంజయ్ కుమార్ సింగ్ వెల్లడించారు. ఆర్యన్, మోహక్ మినహా మిగతా కొంత మంది వ్యక్తులు డ్రగ్స్ కలిగి ఉన్నారని ఎన్సీబీ అధికారి సంజయ్ కుమార్ సింగ్ అన్నారు.

ఆర్యన్ ఖాన్ కు వ్యతిరేఖంగా ఎలాంటి ఆధారాలు లేవని ఆయన తరుపున న్యాయవాది ముకుల్ రోహాత్గి వెల్లడించారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే ఆర్యన్ ఖాన్ ను అక్రమంగా అరెస్ట్ చేశారని అన్నారు. డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ దాదాపు 27 రోజుల పాటు జైలులో ఉన్నారు. గతేడాది ఈ కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అప్పటి ఎన్సీబీ చీఫ్ సమీర్ వాంఖడే కేసులను సీరియస్ గా తీసుకున్నాడు. అయితే ఈ కేసుపై రాజకీయంగా బీజేపీ, శివసేన సర్కార్ కు మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు నడిచాయి. మంత్రి నవాబ్ మాలిక్ సమీర్ వాంకడేపై తీవ్రమైన ఆరోపణలు చేశారు.

Exit mobile version