NTV Telugu Site icon

COVID vaccine: చిన్నారులకు వ్యాక్సినేషన్‌లో ట్విస్ట్..!

Vaccination

Vaccination

కరోనా మహమ్మారికి చెక్‌ పెట్టేందుకు అనేక రకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి.. భారత్‌లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా టీకాల పంపిణీ జరుగుతోంది.. భారత్‌లో ఏజ్‌ గ్రూప్‌ల వారిగా వ్యాక్సినేషన్‌ పెంచుతూ వస్తోంది సర్కార్‌.. అందులో భాగంగా.. 5-12 ఏళ్ల వయసు గల చిన్నారులకు అత్యవసర వ్యాక్సినేషన్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చినా.. టీకా పంపిణీపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోనట్టుగా సమాచారం. టీకా పంపిణీపై ఏర్పాటు చేసిన సాంకేతిక సలహా బృందం ఇవాళ నిర్వహించే సమావేశంలో నిర్ణయం తీసుకుంటారని ప్రచారం జరిగినా.. నిపుణుల కమిటీ ఇచ్చే సిఫార్సుల ఆధారంగా ఐదేళ్లు పైబడిన పిల్లలకు వ్యాక్సిన్ అందించే అంశంపై నిర్ణయం తీసుకోనున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్​సుఖ్ మాండవీయ తెలిపారు. అయితే, 12-17 ఏళ్ల వయసు మధ్య వారికి సీరం ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఇండియా రూపొందించిన కొవొవాక్స్​టీకాకు గ్నీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టుగా సమాచారం.

Read Also: Minister Karumuri: కేటీఆర్‌ వ్యాఖ్యలకు ఏపీ మంత్రి స్ట్రాంగ్‌ కౌంటర్‌