Site icon NTV Telugu

కోవాగ్జిన్‌ వినియోగ గడువు ఏడాది పెంపు..

కరోనాపై పోరాటానికి భారత్‌ బయోటెక్‌ కంపెనీ రూపొందించిన కోవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ వినియోగ గడువును ఏడాది పాటు పొడిగించారు.. ఈ మేరకే సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ (CDSCO).. వాక్సిన్‌ తయారీ తేదీ నుంచి ఏడాది పాటు వినియోగించేందుకు అనుమతి ఇచ్చింది.. ఈ విషయాన్ని ఆ వ్యాక్సిన్‌ తయారీ సంస్థ భారత్‌ బయోటెక్‌ ప్రకటించింది.. అయితే, వ్యాక్సిన్‌ వినియోగ గడువును 24 నెలలకు పొడగించాలంటూ.. డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియాకు లేఖ రాసింది. దానితో పాటు టీకాకు సంబంధించిన డేటాను కూడా సమర్పించింది.. ఈ కోవిడ్-19 వ్యాక్సిన్ ప్రస్తుత షెల్ఫ్ లైఫ్ ఆరు నెలలు అంటే రెండు నుండి ఎనిమిది డిగ్రీల సెల్సియస్ వద్ద నిల్వ చేసినట్లయితే, టీకాలు తయారీ తేదీ నుండి ఆరు నెలల వరకు ఉపయోగించవచ్చు.. కానీ, ఇప్పుడు, టీకా మోతాదులు ఒక సంవత్సరం వరకు నిల్వ చేయబడతాయి.. ఈ గడువు పొడిగింపు నిర్ణయం వ్యాక్సిన్ వృథాను తగ్గిస్తుందని చెబుతున్నారు.

Exit mobile version