NTV Telugu Site icon

Rahul Gandhi: అంబేద్కర్‌ని అవమానిస్తే దేశం సహించదు..

Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi: రాజ్యసభలో అమిత్ షా చేసిన ప్రసంగం వివాదాస్పదంగా మారింది. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ గురించి తప్పుడు వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్‌తో పాటు ఇతర ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు స్పీచ్‌లోని కొంత భాగాన్ని మాత్రమే కాంగ్రెస్ వైరల్ చేస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది. మొత్తం చర్చను చూస్తే అమిత్ షా ఏం చెప్పారో అర్థమవుతుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.

ఇదిలా ఉంటే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. బాబాసాహెబ్ అంబేద్కర్‌ని అవమానించడాన్ని దేశం సహించదని బుధవారం అన్నారు. రాజ్యసభలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ‘‘“బాబా సాహెబ్ రాజ్యాంగ రూపశిల్పి, దేశానికి దిశానిర్దేశం చేసిన గొప్ప వ్యక్తి, అతని అవమానాన్ని లేదా రాజ్యాంగాన్ని అవమానిస్తే దేశం సహించదు. ఆయన చేత హోంమంత్రి క్షమాపణ చెప్పాలి.’’ అని రాహుల్ గాంధీ ఫేస్‌బుక్ పోస్టులో డిమాండ్ చేశారు.

Read Also: Sleep Effect: 6 గంటల కంటే తక్కువ నిద్రపోతే.. 2050 నాటికి ఏమి జరుగుతుంది? భయానక ఫలితాలు..

పార్లమెంట్ ఆవరణలో మాట్లాడుతూ.. ‘‘వారు(బీజేపీ) రాజ్యాంగానికి వ్యతిరేకం, రాజ్యాంగాన్ని మారుస్తామని వారు గతంలో చెప్పారు, వారు అంబేద్కర్, ఆయన సిద్ధాంతాలకు వ్యతిరేకం, వారి పని అంబేద్కర్ రాజ్యాంగాన్ని ముగించడమే అని దేశం మొత్తానికి తెలుసు.” అని అన్నారు.

రాజ్యసభలో అమిత్ షా మాట్లాడుతూ.. ఇప్పుడు ప్రతిపక్షాలు అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్ అని చెప్పడం ఫ్యాషన్ అయిపోయింది, ఇంతలా దేవుడు పేరు తలుచుకుంటే వారికి స్వర్గంలో చోటు లభించి ఉండేది అని అన్నారు. ఈ వ్యాఖ్యలే మొత్తం వివాదానికి కారణమైంది.

Show comments