కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టినట్టే పట్టి తిరిగి విజృంభిస్తోంది. మొదటి వేవ్ తరువాత క్రమంగా పరిస్థితులు చక్కబడుతున్నాయి అనుకునే సమయంలో సెకండ్ వేవ్ రూపంలో మరింత విజృంబించింది. దీంతో దేశాల పరిస్థితి మరింతగా దిగజారిపోయింది. ఎప్పుడూ లేనంతగా పరిస్థితులు మారిపోయాయి. థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉన్నదని వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వాలతో పాటుగా ప్రజలు కూడా అప్రమత్తం అయ్యారు. మొదటి వేవ్ తరువాత సరైన జాగ్రత్తలు తీసుకొకవపోవడం వలనే ఈ పరిస్థితులు తలెత్తాయి. కరోనానుంచి ప్రజలను రక్షించాలని చాలా చోట్ల యాగాలు, పూజలు చేస్తున్నారు. ఇక యూపీలో అయితే ఏకంగా కరోనా మాతా పేరుతో గుడినే కట్టేశారు. గుడిని నిర్మించి పూజలు చేస్తున్నారు. యూపీలోని శుక్లాపూర్ గ్రామంలో గ్రమస్తులు గుడిని నిర్మించి పూజలు చేస్తున్న వీడియో బయటకు రావడంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున శుక్లాపూర్‌లోని కరోనా మాత ఆలయం సందర్శించి పూజలు చేస్తున్నారు.
వైరల్ః యూపీలో కరోనా దేవాలయం…మహమ్మారిని తరిమికొట్టాలంటూ…
