NTV Telugu Site icon

Delhi Elections: 16 మందితో మూడో జాబితా విడుదల చేసిన కాంగ్రెస్

Congress

Congress

దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మూడో జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. 16 మందితో కూడిన లిస్ట్‌ను వెల్లడించింది. పటేల్ నగర్ నుంచి కేంద్ర మాజీ మంత్రి కృష్ణ తీరథ్, ఓఖ్లా నుంచి అరిబా ఖాన్ పోటీ చేస్తు్న్నారు. ఇటీవల పార్టీలో చేరిన ఆప్ మాజీ ఎమ్మెల్యే ధరమ్ పాల్ లక్డా.. ముండ్కా నుంచి పోటీ చేయనున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే పటేల్ నగర్ స్థానానికి కేంద్ర మాజీ మంత్రి కృష్ణ తీరథ్ నామినేషన్ దాఖలు చేశారు. గోకల్‌పూర్‌లో ప్రమోద్‌ జయంతి స్థానంలో ఈశ్వర్‌ బగ్రీకి టిక్కెట్‌ ఇచ్చారు. రాజేష్ గుప్తా కిరారీ నుంచి, కున్వర్ కరణ్ సింగ్ మోడల్ టౌన్ నుంచి, జగత్ సింగ్ షహదారా నుంచి, రాజీవ్ చౌదరి విశ్వాస్ నగర్ నుంచి, విశేష్ తోకాస్ ఆర్ కె పురం నుంచి పోటీ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Manu Bhaker: మను భాకర్ ఒలింపిక్స్ పతకాలు డ్యామేజ్.. తిరిగి ఇస్తామన్న అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ

26 మంది పేర్లతో పార్టీ రెండో జాబితాను జనవరి 6న విడుదల చేశారు. జంగ్‌పురా స్థానం నుంచి ఆప్‌ నేత మనీష్‌ సిసోడియాపై ఫర్హాద్‌ సూరి పోటీ చేస్తున్నారు. ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన ఇద్దరు ఆప్‌ మాజీ ఎమ్మెల్యేలకు కూడా టిక్కెట్లు ఇచ్చారు. అసిమ్ ఖాన్ మతియా మహల్ నుంచి, దేవేందర్ సెహ్రావత్ బిజ్వాసన్ నుంచి పోటీ చేయనున్నారు. న్యూఢిల్లీ స్థానంలో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌పై కాంగ్రెస్‌ పార్టీ సందీప్‌ దీక్షిత్‌ను పోటీకి దింపింది. కల్కాజీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఢిల్లీ సీఎం అతిషిపై పోటీ చేసేందుకు అల్కా లాంబాను బరిలోకి దింపారు.

ఇది కూడా చదవండి: Business Idea: ఈ బిజినెస్ తో మీరు వద్దన్నా ఆదాయం పక్కా!.. రోజుకు 3 గంటలు చాలు.. పెట్టుబడి తక్కువే!

ఢిల్లీ ఎన్నికల్లో మొత్తం 70 స్థానాల్లో కాంగ్రెస్ స్వతంత్రంగా పోటీ చేస్తోంది. మొత్తం 70 స్థానాల్లో పోటీ చేస్తాం.. మేం గెలిచిన తర్వాతే నాయకుడిని ఎన్నుకుంటామని ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ దేవేందర్ యాదవ్ అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఒకే దశలో ఫిబ్రవరి 5న జరగనుండగా, ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు జరగనుంది.

 

Show comments