Site icon NTV Telugu

డార్క్​ చాకెట్లు, గోమూత్ర సలహాలు బంద్ చేయండి: కాంగ్రెస్ నేత

క‌రోనా సెకండ్ వేవ్ క‌ల్లోలం సృష్టిస్తోంది. రికార్డుస్థాయిలో పాజిటివ్ కేసులు న‌మోదు అవుతుండగా.. మృతుల సంఖ్య కూడా భారీగానే పెరుగుతోంది. ఈ స‌మ‌యంలో కొందరు కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు గోమూత్రం తాగడం వల్ల ప్రయోజనం ఉంటుందంటూ చెప్పుకొస్తున్నారు. అయితే ఈ ప్రచారంపై కాంగ్రెస్​ నేత జైవీర్ షెర్గిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారుల వైద్య సేవల కోసం కేంద్రం ఏదైనా కార్యనిర్వహక దళాన్ని ఏర్పాటు చేసిందా.. అని ట్విట్టర్​ ద్వారా జైవీర్ షెర్గిల్ ప్రశ్నించారు. డార్క్​ చాకెట్లు తినండి, గోమూత్రం తాగండి.. అనే సలహాలు బంద్ చేసి.. భాజపా ప్రభుత్వం చిన్నారుల సంరక్షణ కోసం సన్నాహక చర్యలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు.

Exit mobile version