Abhjeet Dipke: ‘‘దీపావళి వరకు వద్దు’’.. CJP నిరసనలపై అభిజిత్ దీప్కే మెసేజ్..

  • దీపావళి వరకు నిరసనలు వద్దు..
  • కార్యకర్తలు తమ కుటుంబాలతో ఉండండి..
  • బొద్దింకలకు అభిజిత్ దీప్కే మెసేజ్..
Cjp Founder Abhijit Dipke

Cjp Founder Abhijit Dipke

Abhjeet Dipke: గత కొన్ని రోజులకు నిరసనలు చేస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ(CJP), తన నిరసనలకు బ్రేక్ ఇచ్చింది. ఈ విషయాన్ని సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే మంగళవారం ప్రకటించారు. దీపావళి వరకు ఎలాంటి నిరసనలు చేపట్టే ప్లాన్ లేదని దీప్కే చెప్పారు. ఆయన తన మద్దతుదారులను కాక్రోచెస్ అని సంభోదిస్తూ.. పండగ సమయంలో తమ కుటుంబ సభ్యులతో, ప్రియమైనవారితో గడపాలని కోరారు. గత 10-12 రోజులుగా ఉద్యమాల్లో పాల్గొన్న వారు, వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అభిజిత్ దీప్కే అన్నారు. సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలు జైలులో ఉన్నప్పటికీ, ఉద్యమకారులు బెదిరిపోరని అన్నారు.

ఉద్యమంలో పాల్గొన్న చాలా మంది వాలింటీర్లు వీధుల్లో దెబ్బలు తిన్నారని, కస్టడీలో ఉన్నప్పుడు వేధింపులకు గురయ్యారని అన్నారు. ఈ పరిస్థితుల్లో వారి కుటుంబాలు ప్రభావితమవుతున్నాయని, ఇది పండగ సమయం కావడంతో, వారి కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయని, కాబట్టి ప్రజలు కొన్ని రోజుల పాటు తమ కుటుంబీకులతో గడపాలని అభిజిత్ దీప్కే కోరారు. “మనం ద్వేషానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం. ఆ ద్వేషం మనలోకి ప్రవేశించకుండా కూడా మనం చూసుకోవాలి. మనల్ని ద్వేషించే వారిలా మనం మారకూడదు. ఒకరిపట్ల ఒకరికి ఉండే ప్రేమ, కరుణ, దయలే మన గొప్ప బలం” అనే సందేశాన్ని ఇచ్చారు.

ఇదే సమయంలో తాను సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా లేకపోవడాన్ని ప్రస్తావించారు. “మేము వెనకడుగు వేయము. సౌరభ్, అశు జైలుకు వెళ్తే మేమేమీ భయపడము. ఎందుకంటే మేము సరైన దాని కోసం పోరాడుతున్నాము, తప్పు కోసం కాదు” అని అన్నారు. మన భావోద్వేగాలు మన బలహీనత కాదని, అవే మన బలం అని, తాము రాజ్యాంగాన్ని , మహాత్మా గాంధీ శాంతి, అహింసా విలువల్ని పాటిస్తామని దీప్కే అన్నారు.