Char Dham Yatra 2024: హిందువులు ఎంతో పవిత్రంగా భావించే చార్ ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్లు ఈ రోజు ప్రారంభమైంది. యాత్రలో భాగంగా కేధార్ నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రిని సందర్శించాలనుకునే భక్తులు ఈ యాత్రకు రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. చార్ ధామ్ యాత్ర కోసం ఉత్తరఖండ్ టూరిజం అధికారిక వెబ్‌సైట్‌ని ప్రారంభించింది. యాత్రికులు తమను తాము నమోదు చేసుకునేందుకు టోల్ ఫ్రీ, వాట్సాప్ సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. కేదార్‌నాథ్, యుమునోత్రి, గంగోత్రి యాత్ర మే 10న ప్రారంభం కాబోతోంది.
ఎందుకు నమోదు చేసుకోవాలి..?
తీర్థయాత్రలో యాత్రికులు రద్దీని పర్యవేక్షించడం, నియంత్రించడం రిజిస్ట్రేషన్ ప్రధాన ఉద్దేశ్యం. యాత్రికులకు భద్రత, సంక్షేమానికి హామీ ఇవ్వడంతో అధికారులకు ఈ రిజిస్ట్రేషన్ సాయం చేస్తుంది. క్లిష్టమైన ప్రాంతాలు, వాతావరణ పరిస్థితుల్లో సహాయ సహకారాలు అదించడానికి ఇది ఉపయోగపడుతుంది.
ఎలా నమోదు చేసుకోవాలి..?
* పర్యాటక వెబ్‌సైట్ registrationandtouristcare.uk.
* వాట్సాప్‌లో యాత్రను రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి 8394833833 నెంబర్‌కి మెసేజ్ చేయాల్సి ఉంటుంది.
* ఇంటర్నెట్‌లో నమోదు చేసుకోలేని సందర్శకుల కోసం, పర్యాటక శాఖ టోల్ ఫ్రీ నంబర్ 0135-1364కు డయల్ చేయడం ద్వారా రిజిస్ట్రేషన్ సేవను అందిస్తుంది.
* రిజిస్ట్రేషన్ విధానంలో యాత్రీకులు వ్యక్తిగత సమాచారం, ప్రయాణ ఏర్పాట్లు, వైద్య సమాచారాన్ని సమర్పించాల్సి ఉంటుంది.
ఆఫ్ లైన్‌లో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి..?
ఉత్తరాళఖండ్ టూరిజం డిపార్ట్‌మెంట్ రిషికేష్, హరిద్వార్‌లలో రిజిస్ట్రేషన్ కౌంటర్లను కలిగి ఉంది. ఇక్కడ యాత్రికులు ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఈ ప్రాంతాల్లో 10 బూత్‌లు ఉన్నాయి. యాత్రికులు ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్, పాన్ కార్డ్ లేదా ఆధార్ కార్డ్ వంటి అవసరమైన పత్రాలతో ఏదైనా బూత్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవడం ఎలా..?
1) www.uk.gov.in/
2) ‘రిజిస్టర్/లాగిన్’ ఆప్షన్ ఎంచుకోవాలి.
3) పాప్-అప్ విండో ఉంటుంది. ఫారమ్‌లో అడిగిన సమాచారాన్ని ఇవ్వాలి.
4) చార్ ధామ్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ వినియోగదారుడిని ధృవీకరించడానికి OTPని ఈమెయిల్ లేదా మొబైల్ నెంబర్‌కి పంపిస్తుంది.
5) వెరిఫై తర్వాత, లాగిన్ చేయడానికి మీ పాస్‌వర్డ్ మరియు ఫోన్ నంబర్‌ను ఉపయోగించండి.
6) లాగిన్ అయిన తర్వాత, మీకు ప్రత్యేకమైన డాష్‌బోర్డ్ కనిపిస్తుంది. ఇందులో ఆడ్/మేనేజ్ లేదా టూరిస్ట్ మెనూ కనిపిస్తుంది.
7) టూర్ గురించిన అవసరమైన మొత్తం సమాచారాన్ని నమోదు చేయండి, అంటే పర్యాటకుల సంఖ్య, యాత్ర తేదీలు, టూర్ టైప్, పర్యటన పేరు వంటి వాటిని నమోదు చేయాలి.
8) మీ డ్రైవర్ లైసెన్స్, ఓటర్ కార్డ్ మరియు ఆధార్ కార్డ్ లేదా ఏదైనా ఇతర చట్టబద్ధమైన చిత్ర ID కాపీని స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తైన తర్వాత నిర్ధారణ కోసం మీకు ప్రత్యేక రిజిస్ట్రేషన్ నంబర్ (URN)తో SMS వస్తుంది.
10) చార్ ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్ లెటర్ డౌన్ లోడ్ చేయాలి. తీర్థయాత్ర సమయంలో ఇది అవసరం.