మరోసారి కోవిడ్ ఆంక్షలు పొడిగించింది కేంద్ర ప్రభుత్వం.. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ లేఖలు రాసింది.. ఫిబ్రవరి 28వ తేదీ వరకు కరోనా మార్గదర్శకాలను పొడిగించినట్టు పేర్కొంది.. ఇదే సమయంలో.. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన తగు చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది కేంద్రం.. కేసులు తగ్గుముఖం పట్టాయనే ఉద్దేశంతో.. రక్షణ చర్యలను విస్మరించవద్దని పేర్కొంది.. కాగా, కరోనా థర్డ్ వేవ్ పంజా కొనసాగుతూనే ఉంది.. పెద్ద సంఖ్యలో కొత్త కేసులు వెలుగు చూస్తున్న విషయం తెలిసిందే.
Read Also: కాంగ్రెస్‌కు మరో షాక్.. పార్టీకి మరో కేంద్ర మాజీ మంత్రి గుడ్‌బై..
