కేంద్ర పౌరయానశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత 33 రోజుల్లోనే మధ్యప్రదేశ్‌కు 44 విమానాలను తీసుకొచ్చారు. మధ్యప్రధేశ్‌లోని చిన్న చిన్న నగరాల్లో కూడా విమానాశ్రాలు ఏర్పాటు చేయడంపై దృష్టిసారించినట్టు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం జబల్పూర్ నుంచి ముంబై, పూణే, సూరత్, హైదరాబాద్, కోల్‌కతా నగరాలకు విమానాలు నడుస్తున్నాయని, ఆగస్టు 20 నుంచి ఢిల్లీ, ఇండోర్‌లకు కూడా విమాన సర్వీసులు అందుబాటులో ఉంటాయని అన్నారు. ఇక 44 విమానాల్లో 8 విమానాలు ఉడాన్ పథకం కింద అందుబాటులోకి తీసుకొచ్చినట్టు ఆయన పేర్కొన్నారు. ఈ పథకంలో భాగంగా చిన్న చిన్న విమానాశ్రయాలను మెట్రోనగరాలు, ఇతర నగరాలకు అనుసంధానం చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మరింత చౌకగా, అందరికీ అందుబాటులో ఉండే విధంగా విమాన ప్రయాణాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు.
Read: ఏపీ అప్పుల్లో వుంది.. కేంద్ర నిధులతో అభివృద్ధి జరుగుతోంది
