Site icon NTV Telugu

ఎల్ఐసీ కీలక నిర్ణయం.. ఆయన పదవీకాలం పొడిగింపు

ప్రభుత్వ బీమా రంగ సంస్థ ఎల్‌ఐసీ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ చైర్మన్ పదవీకాలాన్ని ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. దీంతో పాటు మేనేజింగ్ డైరెక్టర్లలో ఒకరైన రాజ్ కుమార్ పదవీకాలాన్ని కూడా ప్రభుత్వం ఏడాది పొడిగించింది. ఈ పొడిగింపుతో ఎం.ఆర్. కుమార్ 2023 మార్చి వరకు ఛైర్మన్‌ హోదాలో కొనసాగనున్నారు. త్వరలో ఐపీఓకి వచ్చేందుకు సిద్దం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఐపీఓకి వచ్చేందుకు ఎల్‌ఐసీ సిద్దం అవుతోంది.

https://ntvtelugu.com/fb-messenger-will-soon-alert-you-if-someone-takes-chat-screenshots/

ఎల్‌ఐసీ వైర్మన్‌ పదవీకాలాన్ని పొడిగించడం ఇది రెండవసారి. గత ఏడాది జూన్‌లోనూ ఎం.ఆర్‌.కుమార్‌కు 9 నెలల పొడిగింపునిచ్చారు. సంగతి మనకు తెలిసిందే. ఐపీవోకి సంబంధించిన ప్రక్రియ సాఫీగా సాగాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఎల్‌ఐసీ ఐపీఓకి వీలుగా లైఫ్‌ ఇన్ఫూరెన్స్‌ కార్పొరేషన్‌ చట్టానికి ప్రభుత్వం ఇప్పటికే కొన్ని మార్పులు చేసింది. అవన్నీ గత ఏడాది జూన్‌ 30 నుంచే అమల్లోకి వచ్చాయి. ఎల్‌ఐసీ ఐపీఓలో జాబితా చేసిన తర్వాత రూ.8-10 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువతో దేశంలో అతిపెద్ద సంస్థగా మారే అవకాశం ఉంది. దేశంలోనే ఎల్ఐసీ అతి పెద్ద బీమా సంస్థ. తమ పాలసీదారుల విషయంలో ఎల్ ఐసీ ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Exit mobile version