Site icon NTV Telugu

Central GovT Tax Hike: కేంద్ర సర్కార్ షాకింగ్ నిర్ణయం.. పొగాకు, పాన్ మసాలాలపై భారీగా పన్ను..

Gutka

Gutka

Central GovT Tax Hike: కేంద్ర ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. దేశంలో సిగరెట్లు, పాన్ మసాలా, గుట్కా లాంటి ఉత్పత్తులపై అమలులో ఉన్న పన్ను విధానాన్ని మార్చేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో రెండు ప్రధాన బిల్లులను ప్రవేశ పెట్టడానికి రెడీ అయింది. మొదటి బిల్లు ‘హెల్త్ సెక్యూరిటీ అండ్ నేషనల్ సెక్యూరిటీ సెస్ బిల్లు 2025’, రెండోది సెంట్రల్ ఎక్సైజ్ చట్ట సవరణ బిల్లులను పెట్టనుంది. ఈ రెండు బిల్లులు ప్రస్తుతం అమలులో ఉన్న GST పరిహార సెస్సును తొలగించి, కొత్త పేరుతో కానీ అదే నిర్మాణంతో పన్నుల వసూళ్లను కొనసాగిస్తుంది.

Read Also: Dil Raju : బాలీవుడ్‌ నుండి ఏకంగా 6 సినిమాలతో రాబోతున్న దిల్‌రాజు..

అయితే, ప్రస్తుతం సిగరెట్లు, పాన్ మసాలా, గుట్కా వంటి ఉత్పత్తులు GSTతో పాటు ‘కంపెన్సేషన్ సెస్సు’ కింద ట్యాక్స్ కడుతున్నాయి. ఈ సెస్సు త్వరలో ముగియనుంది. దీంతో ప్రభుత్వం ఆదాయ నష్టాన్ని నివారించుకోవడానికి అదే సెస్సును కొత్త చట్టంలో కొనసాగించాలని ప్లాన్ చేస్తుంది. ఈ మార్పు పన్ను వసూళ్లను మరింత ఈజీగా చేయడంతో పాటు సంస్థాగత పారదర్శకతను పెంచడమే లక్ష్యంగా పెట్టుకుంది.

Read Also: OnePlus 13R Price Drop: ఆఫర్లు బాబోయ్ ఆఫర్లు.. డెడ్ చీప్‌గా లేటెస్ట్ ‘వన్‌ప్లస్‌ 13ఆర్‌’, డోంట్ మిస్!

ఇక, సామాన్య ప్రజలకు ధరల పెరుగుదల ప్రస్తుతానికి కనిపించదు, పన్ను రేట్లు మారడం లేదంటున్నారు నిపుణులు. అయితే, కంపెనీలకు మాత్రం రిపోర్టింగ్ విధానాలు, అకౌంటింగ్ ప్రక్రియలు, పన్ను కంప్లయన్స్ లో మార్పులు వచ్చే ఛాన్స్ మాత్రం ఉంది. ముఖ్యంగా సిగరెట్ తయారీ రంగం ఇప్పటికే అధిక పన్ను భారాన్ని మోస్తుంది. కొత్త చట్టం అమల్లోకి వస్తే మరింత కఠినమైన నియంత్రణలు, పర్యవేక్షణ తప్పనిసరి అవుతుంది.

Read Also: Black Friday Deal: రూ.19,999ల Fire-Boltt Ninja Call Pro Plus స్మార్ట్వాచ్ కేవలం రూ.998కే.. ఎక్కడ కొనాలంటే..?

అలాగే, సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులను GST పరిధి నుంచి తొలగించి మళ్లీ సెంట్రల్ ఎక్సైజ్ పరిధిలోకి తీసుకు రావాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తుంది. దీని వల్ల ఎక్సైజ్ చట్టం పన్నులను ట్రాక్ చేయడంతో పాటు ఉత్పత్తి స్థాయిలో పరిశీలించడం ఈజీ అవుతుంది. ఈ మార్పు పన్ను ఎగవేతలను తగ్గించడం, అక్రమ రవాణాను నియంత్రించడం, పన్ను సేకరణను మరింత క్రమబద్ధం చేయడంలో తోడ్పడుతుంది. ఈ ఒక్క నిర్ణయంతో ఆర్థికంగానే కాకుండా, ఆరోగ్య రక్షణ కోసం ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు అవుతుంది. పాన్ మసాలా, గుట్కా, పొగాకు ఆధారిత ఉత్పత్తులు ఆరోగ్యానికి హానికరం.. ఈ కారణంగా, వీటి వినియోగాన్ని తగ్గించడానికి అధిక పన్నులు విధించే విధానాన్ని కేంద్ర సర్కార్ కొనసాగిస్తుంది. ఇదే టార్గెట్ తో కొత్త సెస్సుకి ‘ఆరోగ్య భద్రత’ అనే పేరును పెట్టనున్నట్లు తెలుస్తుంది.

Exit mobile version