NTV Telugu Site icon

Bar Code: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. మెడిసిన్స్‌పై బార్‌కోడ్ తప్పనిసరి

Medicines

Medicines

Bar Code: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నకిలీ మందులకు అడ్డుకట్ట వేసేందుకు ఔషధాలపై బార్ కోడ్ తప్పనిసరి చేసింది. ఈ నేపథ్యంలో 300 డ్రగ్ ఫార్ములేషన్స్‌పై కంపెనీలు బార్ కోడ్ కచ్చితంగా ముద్రించాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం 2023 ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ బార్ కోడ్‌లో మ్యానుఫ్యాక్చరింగ్ లైసెన్స్, అడ్రస్ తేదీ, బ్యాచ్ నంబర్, డ్రగ్ జనరిక్ పేరు, కంపెనీ పేరు, గడువు తేదీ వివరాలను కంపెనీలు పేర్కొనాల్సి ఉంటుంది. దీన్ని మెడిసిన్స్ ఆధార్ కార్డుగా పరిగణిస్తున్నారు.

Read Also: Canada: భారతీయులకు గుడ్ న్యూస్ చెప్పిన కెనడా..

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న 300 బ్రాండ్‌లపై బార్ కోడ్ లేదా క్యూఆర్ కోడ్ ముద్రించబడుతుంది. బార్ కోడ్ లేదా క్యూఆర్ కోడ్‌ను ప్రింట్ చేయడంతో ఔషధాలను కొనుగోలు చేసే సమయంలో వినియోగదారులు తమ మొబైల్ నుంచి కోడ్‌ను స్కాన్ చేసి ఔషధం నిజమైందా లేదా నకిలీదా అని తెలుసుకోవచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచంలో అమ్ముడవుతున్న నకిలీ మందులలో 35 శాతం భారతదేశంలోనే తయారవుతున్నాయి. దీంతో మార్కెట్‌లో విక్రయించే నకిలీ మందులను అరికట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.