NTV Telugu Site icon

Central Government: కేంద్రం మరో కీలక నిర్ణయం.. త్వరలో పీఎంశ్రీ స్కూల్స్

Pm Sri Schools

Pm Sri Schools

కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. చదువు పూర్తయ్యాక ఉద్యోగానికి కావాల్సిన నైపుణ్య శిక్షణ పొందడం ప్రస్తుత మన విద్యా విధానం. మున్ముందు కోర్సు అవగానే కొలువులు సాధించేలా విద్యార్థులు సుశిక్షితులు కానున్నారు. ఈ నేపథ్యంలో ఆధునిక ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనేలా భావి భారత పౌరులను తీర్చిదిద్దేందుకు దేశవ్యాప్తంగా పీఎంశ్రీ పాఠశాలలను నెలకొల్పనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. జాతీయ నూతన విద్యా విధానానికి ఈ పాఠశాలలు ప్రయోగశాలలుగా ఉపయోగపడతాయని ఆయన అభివర్ణించారు.

Central Government: సామాన్యులకు షాక్.. వంట గ్యాస్‌పై సబ్సిడీ ఎత్తివేత

గుజరాత్‌లో జరిగిన నేషనల్‌ ఎడ్యుకేషన్‌ మినిస్టర్స్‌ కాన్ఫరెన్స్‌ ప్రసంగంలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ ప్రకటన చేశారు. నాలెడ్జ్ ఎకానమీగా ఇండియాని రూపొండించడంలో రాబోయే 25 సంవత్సరాలు చాలా కీలకమని ఆయన పేర్కొన్నారు. పాఠశాల విద్య అనేది విద్యార్థికి పునాది వంటిదని.. అత్యాధునిక సదుపాయాలతో ​పీఎం స్కూల్స్ స్థాపిస్తామని ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రీ స్కూల్ నుంచి సెకండరీ స్కూల్ వరకు ఎన్‌ఈపీ 5+3+3+4 విధానం, ఎర్లీ చైల్డ్‌హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం (ECCE), టీచర్ ట్రైనింగ్, వయోజన విద్య, పాఠశాల విద్యతో నైపుణ్యాభివృద్ధిని ఏకీకృతం చేయడమే లక్ష్యంగా తాము పనిచేస్తామని ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. కాగా నూతన విద్యా విధానంలో ప్రాంతీయ భాషలకు ఇచ్చిన ప్రాధాన్యాన్ని ఆయన గుర్తుచేశారు. దేశంలో అన్ని భాషలు దేశీయ భాషలేనని అన్నారు. ఏ భాష కూడా హిందీ, ఇంగ్లీష్ కంటే తక్కువేమీ కాదన్నారు. ప్రతి భాషకు దానిదైన ప్రత్యేకత, గుర్తింపు ఉంటుందని.. అందుకే నూతన విద్యా విధానంలో స్థానిక భాషలకు కూడా ప్రాముఖ్యత కల్పించామని వివరించారు.